దారి మళ్లుతున్న ఖనిజాలు

దారి మళ్లుతున్న ఖనిజాలు
December 22 13:37 2017
నెల్లూరు,
 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా… ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో విలువైన ఖనిజ సంపద అక్రమ మార్గంలో తరలుతోంది. ఉదయగిరి ప్రాంతంలో ఉన్న రెవెన్యూ, అటవీ, అసైడ్డ్ ప్రభుత్వ భూముల్లో అత్యంత నాణ్యమైన తెల్లరాయి నిక్షేపాలు ఉన్నాయి.  వీటిని ఎలాంటి అనుమతులు లేకుండా అధికారులను ప్రలోభపరచుకున్న కొందరు వ్యాపారులు కోట్ల రూపాయల సంపద పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుంది. ఎంతో విలువైన తెల్లరాయిని అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. తనిఖీ కేంద్రాలను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకుని అక్రమ వ్యాపారం సాగిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. తెల్లరాయికి విదేశాల్లో మంచి గిరాకీ ఉండటంతో ఇక్కడి నుంచి చెన్నైకి తరలిస్తారు. ఈ రాయితో అత్యంత విలాసవంతమైన అద్దాలు, టైల్స్ తదితర ఉపకరణాలు తయారుచేస్తారు. నిబంధనలు పాటించని వ్యాపారులు గ్రామ శివారుల్లో బ్లాస్టింగ్‌ లకు సైతం వెనుకాడటం లేదు. రాయి కోసం తీసిన గోతులు పూడ్చకపోవడంతో ఆ గోతుల్లో పడి పదుల సంఖ్యలో పశువులు మృతి చెందుతున్నాయి. అధిక లోడు వాహనాలతో రోడ్లు సైతం గుళ్ల బారుతున్నాయి. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, వింజమూరు మండలాల నుంచి భారీగా తెల్లబంగారం తరలుతుంది. ఈ అక్రమ తరలింపు వల్ల ఏటా ప్రభుత్వానికి పదికోట్లపైనే నష్టం వస్తుందని అంచనా.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎంతో విలువైన ఖనిజ సంపద అక్రమ మార్గంలో తరలివెళ్లకుండా చూడాలని ప్రజలు అంటున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13046
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author