పద్దతి మార్చుకోని కార్పోరేటర్లపై వేటు

పద్దతి మార్చుకోని కార్పోరేటర్లపై వేటు
December 22 15:31 2017
ఖమ్మం,
కార్పోరేటర్లు తమ పనితీరును మెరుగు పరుచువోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్పొరేటర్ల పనితీరుపై మంత్రి  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.  కార్పొరేటర్ల పనితీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించమని స్పష్టం చేసారు. శుక్రవారం నాడు   ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధి దారులకు మంత్రి చెక్కులు పంపిణి చేసి మాట్లాడారు. ఈ  కార్యక్రమంలో  ఎమ్మెల్యే అజయ్, మేయర్ పాపాలాల్,  జడ్పీ ఛైర్ పర్సన్ కవిత, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ  పద్ధతి మార్చుకొని కార్పొరేటర్ల ను వదులుకునేందుకు సిద్ధమని అల్టీమేటం ఇచ్చారు. కార్పోరేటర్లకు చెడ్డపేరు వస్తే ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది. ప్రజలకు మంచి పేరు తెచ్చేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలని సూచించారు. ఖమ్మం కార్పోరేషన్ లో జరుగుతున్న అభివృద్ది సీఎం కేసీఆర్ సహా అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రజల దయతో గెలిచిన మనం ప్రజల కోసం పని చేయాలని అన్నారు. పద్దతి మార్చుకోని కార్పోరేటర్లు సహించేది లేదు..  ఒకటి రెండు సీట్లను వదులుకోవడానికైనా మేము సిద్ధమేనని అయన వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యే సీటు వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీ తో గెలిపించాలి. టీఆర్ ఎస్ లో ఎక్కడా గ్రూపులు ఉండవు.. అందరూ కేసీఆర్ మనుషులేనని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. తరువాత మంత్రి నేలకొండపల్లి మండల కేంద్రంలో 30 డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు,  కేంద్రంలో  ముస్లింల కోసం 10లక్షల వ్యయంతో నిర్మిచ తలపెట్టిన ఖభారస్తాన్ కు మంత్రి శంకుస్థాపన చేసారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13068
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author