ఎఫ్ డీ ఆర్‌ ఐ బిల్లుతో భయం…భయం

ఎఫ్ డీ ఆర్‌ ఐ బిల్లుతో భయం…భయం
December 22 15:41 2017
విజయవాడ
ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌… ఈ బిల్లుపైనే ప్రస్తుతం పల్లెల నుంచి పట్టణాల వరకు వాతావరణం వేడెక్కుతోంది. చివరకు పార్లమెంటు కూడా ఈ బిల్లుపై చర్చతో నిరసనలూ, మద్దతు వాదనలతో క్రమంగా రాజుకుంటోంది. నిజంగా ఈ బిల్లు వల్ల అంత నష్టం ఉంటుందా! నిజంగా నష్టపోతామా అనే సందేహాలు ఖాతాదారులను వేధిస్తున్నాయి.ఎఫ్‌.ఆర్‌.డి.ఐ. బిల్లులో ఏముందో, అమలవుతుందో లేదో కూడా తెలియకుండానే ఖాతాదారులు బ్యాంకుల్లోని తమ డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు ఎగబడుతున్నారు. పెద్ద బ్యాంకుల అధికారులు చాలావరకు నచ్చచెబుతుంటే, చిన్నబ్యాంకులు, కొన్ని ప్రయివేటు బ్యాంకులకు మాత్రం ఎద్దడి తప్పటం లేదు. అసలు బిల్లులో ఏముంది? ఈ బిల్లు సారాంశం ఏంటనేది తెలిసేవరకు దానిపై ఒక నిర్ణయానికి రాలేమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఇది శుద్ధ దండుగ అని, బ్యాంకుల దివాళాకు, రుణ దోపిడీదారులకు ఊతం ఇచ్చినట్టుందని మండిపడుతున్నారు. సోషల్‌ మీడియాలో మాత్రం ఎఫ్‌.ఆర్‌.డి.ఐ.పై సర్వత్రా నిరసనలే వ్యక్తమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నుంచి కోలుకోకముందే, ఆన్‌లైన్‌ లావాదేవీల విషయంలో ఒక కొలిక్కి రాకముందే ఈ బిల్లు తీసుకొస్తే వేల మంది విజయ్‌మాల్యాలు పుట్టుకొస్తారని ట్విటర్‌లలోనూ పోస్టులు పెడుతున్నారు.కేంద్రం ప్రతిపాదిస్తున్న ‘ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్‌ -2017’ సెగ వరంగల్‌ను తాకింది. మోదీ కొత్త చట్టం తెస్తున్నాడటగా.. బ్యాంకుల్లో మన డబ్బుల్ని ప్రభుత్వమే వాడేసుకుంటుందటగా.. అంటూ బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుల ముందు పోటెత్తారు. అలాంటిదేమీ లేదని బ్యాంకు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. అధిక శాతం ఖాతాదారులు మీరు చెప్పేది నిజమైతే తర్వాత మళ్లీ డిపాజిట్‌ చేస్తాం. ఇప్పుడు మాత్రం తీసుకోనివ్వండంటూ బదులివ్వడం గురవారం పలు బ్యాంకుల వద్ద కనిపించింది.వరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట ప్రాంతాల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. వరంగల్‌లోని కొన్ని బ్యాంకుల్లో ప్రజలు వరుసలో నిలబడి డిపాజిట్‌లు వెనక్కి తీసుకున్నారు. పట్టణంలోని మండి బజార్‌లో ఉన్న ఒక జాతీయ బ్యాంకు నుంచి వారం రోజుల్లోనే ఏకంగా రూ. 3 కోట్లు విత్‌ డ్రా చేసుకున్నారు. వరంగల్‌ జేపీయన్‌ రోడ్‌లోని మరో బ్యాంకులో కూడా రూ. 3కోట్ల రూపాయలను విత్‌ డ్రా చేసుకున్నారు. మరో బ్యాంకులో 30 ఖాతాలుంటే అందులో ఉన్న 15 మంది తమ ఖాతాల్లోని డిపాజిట్‌లు వెనక్కి తీసుకున్నారు. ఇతర బ్యాంకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం.అయితే వారు ఆ విషయాన్ని వెల్లడించడానికి ఇష్టపడట్లేదు. విషయం బయటకు పొక్కితే బ్యాంకులన్నీ డిపాజిట్‌లు విడిపించుకునే ఖాతాదారులతో నిండిపోతాయని భయపడుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు వెనక్కి తీసేసుకుంటున్నవారిలో ఎక్కువ మంది.. దిగువ, ఎగువ మధ్య తరగతి ప్రజలేనని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13074
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author