సైన్స్ కాంగ్రెస్ వాయిదా దారుణం

సైన్స్ కాంగ్రెస్ వాయిదా దారుణం
December 22 16:26 2017
హైదరాబాద్,
ఉస్మానియా యూనివర్సిటీ లో జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్ ను  వాయిదా వేయడాన్ని బీజేపీపార్టీ తరపున తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ శాసపసభా పక్ష నేత కిషన్ రెడ్డి ప్రకటించారు. సదస్సుకు  వివిధ దేశాలకి సంబంధించి 1600మంది ప్రతినిధులు,శాస్త్రవేత్తలు వచ్చెందుకు సిద్ధమయ్యారు. సీఎం కెసిఆర్ కుట్రపూరిత నిర్ణయం మేరకే సైన్స్ కాంగ్రెస్ ఆగిపోయిందని అయన ఆరోపించారు. సైన్స్ కాంగ్రెస్ అర్ధాంతంగా ఆగిపోవడం వల్ల పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఈ కార్యక్రమం ఆపివేయడంతో తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు దేశ ప్రతిష్ట దెబ్బతిన్నదని అయన అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన తీరు అభ్యంతరకారంగా వున్నాయి. తెలుగు బాష అభివృద్ధి కోసం రాష్ట్రం ఎం చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని అయన నిలదీసారు. ముగింపు సభలు సీఎం కెసిఆర్ తుస్సుమనిపించారు. మహాసభలు పేరుతో సీఎం కెసిఆర్ భజన చేయించుకున్నారని అయన విమర్శించారు. కెసిఆర్ భజన మినహా తెలుగు మహాసభల ధ్వారా తెలుగు భాషకి ఒరిగిందేమిలేదని కిషన్ రెడ్డి అన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం కి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ప్రోత్సాహం కూడా అందించలేదు. అవి తెలుగు మహా సభలు కాదు తెరాస  మహాసభలని అన్నారు. తెలుగు  మహాసభలలో  దళిత కవులకి స్థానం దక్కలేదు. తెలుగు మహా సభల్లో మొదటి పొగడ్త కెసిఆర్ కి.. రెండవ పొగడ్త నిజాంకని కిషన్ రెడ్డి అన్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13093
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author