సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి : మంత్రి పోచారం

సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి : మంత్రి పోచారం
December 22 16:41 2017
నిజామాబాద్,
సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి. తెలంగాణ రాష్ట్రం లోని సంక్షేమ పథకాలను చూసి ప్రవాస భారతీయులు ఆశ్చర్యపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన జిల్లాలో పర్యటించారు.  మిషన్ భగీరధ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి తో బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవలు చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పేదల ముఖాల్లో  చిరునవ్వు, సంతోషం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గర్భంతో ఉన్న పేదింటి మహిళలు కూలి పనికి వెళ్ళి అనారోగ్యం పాలవకుండా, తల్లీ, బిడ్డకు పౌష్టికాహారం కోసం అమ్మ ఒడి పథకం ద్వారా నాలుగు విడతలుగా రూ. 12,000, ఆడబిడ్డ అయితే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందిస్తున్నామని అన్నారు. ప్రసవం అయిన తరువాత తల్లీ, బిడ్డ ఆరోగ్యం కోసం కెసిఆర్ కిట్ అందిస్తున్నారు. పేదింటి ఆడబిడ్డలు అప్పుల పాలు కాకూడదు అన్నదే ముఖ్యమంత్రి ఆశయం. కెసిఆర్ కట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీల సంఖ్య పెరిగింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా మెటర్నిటీహాస్పిటళ్ళను నిర్మించబోతున్నామని మంత్రి వెల్లడించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13102
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author