అక్రమంగా తరలిపోతున్న ఎర్రమట్టి

అక్రమంగా తరలిపోతున్న ఎర్రమట్టి
December 23 13:11 2017
మహబూబ్ నగర్,
తవ్వుకున్నోనికి తవ్వుకున్నంత అనే విధంగా మట్టి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. అసైన్డ్ భూములతో పాటు మైనింగ్ పేరిట రాకంచర్ల పారిశ్రామిక వాడలో నిత్యం అనేక లారీలలో అక్రమంగా ఎర్రమట్టిని జేసీబీలు, హిటాచీల సహాయంతో తవ్వి లారీలలో, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు అధికంగానే ఉన్నాయి. అలాగే మండల పరిధిలోని ఎన్కెపల్లి, మీర్జాపూర్, కండ్లపల్లి, గొంగుపల్లి, పూడూరు, కొత్తపల్లి, రాకంచర్ల, తదితర గ్రామాలలో ఉన్న అసైన్డ్ భూములలో రోజు ఏదో ఒక చోట ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తునే ఉన్నారు. మండల రెవెన్యూ అధికారుల కళ్లముందే ఈ తతంగం రోజు కొనసాగుతున్నా ఏమి పట్టించుకోవడం లేదు. తమకెందుకులే అంటూ పెడచెవిన పెడుతున్నారు. గత రెండు మూడేళ్ల నుంచి రాకంచర్ల పార్క్‌లో వేసిన రోడ్లకు అతీ సమీపంలో ఎర్రమట్టిని విచ్చల విడిగా తవ్వుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు కొందరు రెవెన్యూ అధికారులకు చెప్పి గతంలో ఆపివేశారు. తిరిగి కొద్ది రోజులకే అటు అటవీ శాఖ భూములలో ఇటు రెవెన్యూ భూములలో మట్టి తవ్వకాల దందా జోరందుకుంది. అయితే ఈ విషయంపైనా కొద్ది రోజులు వివాదం కొనసాగింది. ఈ తర్వాత రెండు నెలలు ఆగి మళ్లీ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. విచ్చల విడిగా అధికారులకు మామూళ్లు ఇచ్చి ఎర్రమట్టిని తవ్వుకుంటున్నారని స్థానికులు తెలిపారు. రెవెన్యూ అధికారులను ఈ విషయం గురించి అడిగితే వారికి మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయని గతంలో 12 ఎకరాల భూమిని మట్టి తవ్వకాలకు అనుమతులు పొందారని ప్రస్తుతం ఇక్కడే మట్టిని తవ్వుకుంటున్నారని దాటవేస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా అసైన్డ్ భూములలో మట్టిని అక్రమంగా తవ్వుతున్నారని ఫిర్యాదు చేసిన సంబంధిత శాఖ అధికారులు వారితో చేతులు తడిపి పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.మైనింగ్ నిబంధనల ప్రకారం ఒక టన్ను మట్టి తరలింపునకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అది కేవలం తక్కువగా చెల్లించి ఎక్కువ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మట్టిని తరలించే లారీలకు వే బిల్లులు తప్పని సరిగా ఉండాలి. అలాగే కాంటాలో తూకం వేసినట్లు రశీదులు ఉండాలి. అయితే వాస్తవ రూపంలో ఇవన్నీ లేకుండానే వ్యాపారం జరుగుతుంది. రాకంచర్లలోని ఎర్రమట్టి తవ్వకాలలో నిత్యం అనేక లారీలు మట్టిని తరలిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వానికి తక్కువ ఆదాయం చూపుతూ దందా కొసాగిస్తున్నారు.ఎర్రమట్టి అక్రమ తవ్వకాలతో పెద్ద పెద్ద లోయలుగా ఏర్పడుతున్నాయి. ఈ లోయలు ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాకంచర్ల సమీపంలో గతంలో తవ్విన ప్రాంతంలో పెద్ద గోతులు ఉండి ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ ప్రదేశంలో తిరగాలన్నా ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం ఎర్రమట్టి తవ్వే పారిశ్రామిక వాడలో అదే గుంతలు ఏర్పడుతున్నాయి. విచ్చల విడిగా తవ్వకాలు జోరందుకోవడంతో పెద్ద లోయలు ఇక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13164
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author