పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్
December 23 13:50 2017
నిజామాబాద్,
నిజామాబాద్ జిల్లా  ఇందల్ వాయ్ మండలం సిర్నాపల్లి వద్ద రాయలసీమ ఎక్స్ ప్రెస్  పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు క్షేమం గా బయటపడ్డారు. తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తున్న రాయలసీమ ఎక్స్ ప్రెస్ అటవీ ప్రాంతంలో వస్తుండగా ఇంజిన్, ఒక ఏసీ బోగీ పట్టాలు తప్పింది. రైలు తక్కువ వేగంతో వుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన కారణంగా దాదాపు అర కిలోమీటర్ వరకు ట్రాక్ ధ్వంసం అయింది. ఒక్కసారే కుదుపుతో రైలు ఆగిపోవడంతో భయభ్రాంతులకు లోనయిన ప్రయాణికులు వెంటనే రైలు దిగిపోయారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13185
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author