భాగ్యనగరం…హరిత హారం

భాగ్యనగరం…హరిత హారం
December 23 15:07 2017
హైద్రాబాద్
సెలవు దినాలు వస్తే పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ,స్కూల్ పిల్లలు ,చిన్న పిల్లలు ఉద్యాన వనాలలో ఆడుకోవడానికి ప్రభుత్వం  పార్కు లను ఏర్పాటు చేస్తుంది…రాష్ట్ర వ్యాపాతంగా  అర్బన్ ప్రాంతాలకు దగ్గరగా పార్క్ లను ఏఏర్పాటు చేసి…అందులో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఫ్రీగా..ప్రైవేట్ పాఠశాల పిల్లలకు తక్కువ టికెట్ తో సందర్శించాలని సూచించారు అధికారులు..కాలుష్య రహిత, పచ్చటి పర్యావరణహిత సౌకర్యాలతో కాలనీలకు సమీపంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.తెలంగాణ పట్టణ ప్రాంత ఉద్యాన వనాలు ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం…పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అట ప్రాంతాలను పార్కులుగా అభివృద్ది చేస్తున్నారు..  తెలంగాణకు హరితహారంలో భాగంగా పట్టణ పార్కుల అభివృద్ది, పర్యవేక్షణ అరోగ్య తెలంగాణ లక్ష్యంగా, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన జీవన విధానం కోసం ఉద్యాన వనాలు ఏఏర్పాటు చేస్తున్నారు… కాలుష్య రహిత, పచ్చటి పర్యావరణహిత సౌకర్యాలతో కాలనీలకు సమీపంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు…తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 17,410 హెక్టార్లలో మొత్తం 36 పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిచారు…హైదరాబాద్ కు చుట్టుపక్కల 193 అటవీ బ్లాకులు. 58 వేల హెక్టార్ల విస్తీర్ణం….ఔటర్ రింగ్ రోడ్డుకు 5 కి.మీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాలు మొదటి దశలో అభివృద్ధి చేయనున్నారు అధికారులు… తదుపరి దశలో పది కిలో మీటర్ల పరిధిలో అటవీ బ్లాకుల్లో పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు అధికారులు..  ఇప్పటిదాకా 16 అర్బన్ పార్కుల అభివృద్ది చేసింది అటవీ శాఖ…..   అన్ని సౌకర్యాలతో ఆరు పార్కులు ఇప్పటికే పూర్తి చేశారు…ప్రజలకు అందుబాటులోకి సేవలు తీసుకొచ్చారు అధికారులు… అటవీ అభివృద్ది నిధుల నుంచి ఇప్పటిదాకా 17.42 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు…పార్క్  కి వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బధులు కలుగకుండా అధికారులు గైడ్ చేయనున్నారు. ఫారెస్ట్ బ్లాక్ చుట్టూ ఖచ్చితమైన సరిహద్దు ఏర్పాటు, ప్రహారీ గోడ, ఫెన్సింగ్, రెండు వైపులా చూడగలిగే గ్రిల్స్, కందకాలు లను ఏఏర్పటు చేశారు..  హరితహారంలో భాగంగా అటవీ విభాగంలో పచ్చదనం బాగా పెరిగేలా చర్యలతో పాటు, సహజ అటవీ పునరుజ్జీవన చర్యలు చేపట్టనున్నారు..  చక్కటి నడకదారులు , యోగా స్థలం,  సైక్లింగ్ ట్రాక్, ఫైర్ లైన్స్ తో పాటు, పర్యవేక్షణ కోసం అవసరమైన దారుల ఏర్పాటు చేశారు… మంచినీటి సౌకర్యంతో పాటు, కాలకృత్యాల కోసం ఏర్పాట్లు నీటి సదుపాయం చేశారు..పర్యాటకులు, సందర్శకులు అటవీ అందాలు వీక్షించేందుకు వీలుగా వాచ్ టవర్, అడవీ మార్గంలో నడకకు వీలుగా చెట్లపై నుంచి పందిరి మార్గం ,జింకల పార్కు,పక్షుల పార్క్ లను ఏర్పాటు చేశారు..పిల్లలు, పెద్దలు సరదాగా పాల్గొనేలా సహాస క్రీడల ఏర్పాట్లు, రోప్ క్లయింబింగ్, జిప్ లైన్ లు. వారాంతాల్లో కుటుంబ సభ్యులంతా చక్కటి వాతావరణంలో రోజంతా గడిపేలా ఏర్పాట్లు చేశారు..
తక్కువ ఎంట్రీ ఫీజు, అలా వచ్చిన మొత్తాన్ని కూడా అదే పార్క్ సౌకర్యాల మెరుగుదల కోసం వినియోగించనున్నారు..స్కూలు, కాలేజీ పిల్లలు విద్యా పరంగా, పర్యావరణ పాఠాలు నేర్చుకునేలా తగిన చర్యలు తీసుకోనున్నారు..పిల్లలు ఆదుకోవడానికి,వాళ్లను ఆకరించడానికి ప్రత్యేకం దిమ్మెలు  చెట్టుల  ఆకర్షణీయమైన ఏర్పాటు చేశారు.చెట్టు లా ఉండే దిమ్మెలు…అందరూ కూర్చునే విధంగా ఏర్పాటు.. భాగ్యనగర నందన వనం ప్రారంభమైన పట్టణ ప్రాంత పార్కులకు స్థానిక ప్రజలు, సందర్శకుల నుంచి అటవీశాఖకు మంచి ప్రశంసలు వస్తున్నవి అని తెలిపారు అధికారులు… పట్టణ ప్రాంతాల్లో పెరిగిన కాలుష్యం నుంచి సేదతీరేందుకు, చక్కని ప్రకృతి మధ్య ఉదయం, సాయంత్రం నడకకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు చక్కని ప్రాంతాలుగా  పేరొందుతున్నాయి. తమ ప్రాంతాల్లో కూడా ఇలాంటి పార్కులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇతర ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి, అటవీ శాఖకు ప్రతిపాదనలు వస్తున్నాయి అని తెలిపారు అధికారులు…
అర్బన్ పార్క్ ల ఆవశ్యకతను, రానున్న రోజుల్లో మంచి శ్వాస కోసం ఈ పార్కులు అందించే చక్కటి ఆక్సీజన్ వివరాలను కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణకు హరితహారంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వివరించారు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ బ్లాకుల్లో ఇలాంటి పార్కుల అభివృద్దికి అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సహజ అడవిని కాపాడుతూనే, అందులో ఉంటే చెట్లు, జంతువుల రక్షణకు ఎలాంటి హానీ లేకుండా ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నారు.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన, కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫారెస్ట్ అర్బన్ పార్కు లను సందర్శించరు అధికారుల బృందం….
వాయిస్..హైద్రాబాద్ నగరం చుట్టూ ప్రక్కల 193 అటవీ బ్లాక్ లు ఉన్నవి…నగరం తో పాటు తెలంగాణ లో 36 పార్కులను ఏర్పటుకు ప్రణాళికలు రూపొందించారు అధికారులు…పార్క్ ల ఏఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం ,ఆక్సిజన్ జోన్ లో ఉండవచ్చు అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13215
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author