పీవీకి ఘనంగా నివాళులు

పీవీకి ఘనంగా నివాళులు
December 23 17:30 2017
హైదరాబాద్,
మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు దేశం గర్వించదగ్గ రాజనీతిజ్ఞుడని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. శనివారం పీవీ నరసింహారావు 13వ వర్దంతి సందర్భంగా పీవీ ఘాట్లో స్పీకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ తెచ్చిన సంస్కరణలు దేశాన్ని మార్చిరాయన్నారు. మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రధానిగా ఎదిగారని, అనేక విషయాల్లో ప్రావీణ్యం గల మహానేత పీవీ నర్సింహరావు అన్నారు. పీవీ దేశానికి అందించిన సేవలు మరువలేనిదని ఈసందర్భంగా ఆయన తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసిన వారిలో పీవీ నరసింహారావు ఒకరని అన్నారు. ఢిల్లీలో పీవీ స్మారక చిహ్నం ఏర్పాటు చేయలేకపోయారని అయన వ్యాఖ్యానించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన నేపథ్యంలో కొత్త నూతన వ్యవస్థను ఏర్పాటు చేశారు. పీవీ నరసింహారావు తెలుగు బిడ్డ అవ్వడం మన అదృష్టమని దత్తాత్రేయ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మోడీ  అన్ని పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. పీవీ నరసింహారావు  అన్ని పనులను రాజకీయ కోసం కాదు అభివృద్ధి కోసం చేశారని అయన అన్నారు.
భారతదేశంలో పీవీ నర్సింహరావు అగ్రనాయకుడని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపించిన ఘనత పీవీదేనన్నారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్లే అమెరికాలాంటి దేశాలను ఎదుర్కోగలుగుతున్నామన్నారు. టెక్నోలజీ, ప్రవేశ పెట్టింది కుడా అయనేనని అన్నారు. ఢిల్లీలో ఆయనకు ఆదరణ దక్కకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు.మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే కొంతమంది వ్యక్తుల్లో పీవీ నర్సింహరావు ఒకరని అన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలందించారన్నారు. పీవీ వర్దంతి సంస్మరణ సభను అధికారికంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి ప్రధాన మంత్రి గా ,కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు పీవీ గా ఎన్నో సేవలు చేసారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని దేశ స్థాయిలో అభివృద్ధి పరిచారని అన్నారు. పీవీ దేశానికి చేసిన సేవలు అభినందనీయం . ప్రపంచదేశాలలో భారత ఆర్థిక వ్యవస్థ గొప్పగా వుండడానికి కారణం పీవీ అని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13263
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author