వెంకన్న దర్శనానికి ఆధార్  తప్పనిసరి

వెంకన్న దర్శనానికి ఆధార్  తప్పనిసరి
December 23 19:01 2017
తిరుమల,
 తిరుమలలో శ్రీవారి టైంస్లాట్ దర్శనాలన్నింటికీ ఆధార్అనుసంధానం చేయాలని టీటీడీ భావిస్తోంది. ఆదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి ఆధార్అనుసంధానం చేశారు. రెండోదశలో పూర్తి స్థాయిలో 300 టికెట్లతో పాటు కాలిబాట దర్శనాలకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని టీటీడీ భావిస్తుంది. దేశంలో ఇప్పటికే 99శాతం మందికి ఆదార్ ఉన్నడంతో… స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఆధార్ తీసుకుని వస్తే… ఎంతో పారదర్శకంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఆధార్ అన్నింటికీ అనుసందానం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు భక్తులకు పారదర్శక సేవలు అందుతున్నాయి. ఇప్పటికే తిరుమలలో ఆధార్ అనసందానంతో… అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లు, వయో వృద్దులకు పంపే దర్శనాల్లో , దివ్యాంగుల దర్శనాలు, వీఐపీ బ్రేక్దర్శనాలకు ఆధార్కార్డు అనుసంధానం చేయటం వల్ల డూబ్లికేషన్తో పాటు అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది.
ఏ దర్శనంలో ఎంత మంది  వెళ్లారు? ఎవరు? ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు? అన్న సమగ్ర వివరాలు టీటీడీ వద్ద రికార్డు అవుతున్నాయి. దీనివల్ల భద్రతా పరంగా కూడా సంబంధిత భక్తుల వివరాలు సంక్షిప్త మవుతున్నాయి. ఇప్పటికే  ఈ ఆధార్ కార్డు అనుసంధానంపై టీటీడీ నిర్వహించిన సర్వేలో 95 శాతంపైగా భక్తులు మద్దతు తెలుపుతున్నారు. తిరుమలేశుని దర్శన విధానంలో ఇప్పటి వరకు రద్దీని బట్టి 300 టికెట్లు రోజూ 20 నుండి 25 వేలు, కాలిబాట దివ్య దర్శనాలకు రోజూ 20 వేలు టైం స్లాట్టికెట్లు కేటాయించి, అమలు చేస్తున్నారు. తాజాగా వారం క్రితం నుండి ఆరంభమైన  సర్వదర్శనం టైం స్లాట్ లోనూ రోజూ 20 వేలు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించారు. భక్తుల రద్దీ, పర్వదినాలు బట్టి అయా టైం స్లాట్దర్శనాల్లో సంఖ్యను పెంచటం, తగ్గించటం వంటి నిర్ణయాలకు వెసులు బాటు కల్పించారు.  ఒక రోజులో  కనిష్టంగా 75వేలు , గరిష్టంగా 90 వేల మందికి మాత్రమే సాఫీగా స్వామి దర్శనం అమలు చేయాలని టీటీడీ ఉన్న తాధికారులు భావిస్తున్నారు. అన్ని రకాలకు టైం స్లాట్దర్శనాలకు ఆధార్ కార్డు తప్పనిసరిచేస్తే డూబ్లికేషన్అవకాశం ఉండదని…నిజమైన భక్తులు స్వామి సేవలో పాల్గొనే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13270
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author