సీఎం సహాయకనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయకనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
December 23 20:18 2017
ఏలూరు,
ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద ఏలూరు నియోజకవర్గంలో గత నాలుగేళ్లలో 5.60 కోట్ల రూపాయలు పేదప్రజలకు అందించామని శాసనసభ్యులు  బడేటి కోట రామారావు (బుజ్జి) చెప్పారు. స్ధానిక ఎ మ్మెల్యే కేంపు కార్యాలయంలో శనివారం 3 కుటుంబాలకు రూ. 5.73 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేసారు. ఈసందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. వివిధ దీర్ఝకాలిక రోగాలబారినపడినవారికి యన్టిఆర్ వైద్యసేవ క్రింద ఉచిత వైద్యాన్ని అందించడంతోపాటు ఇంకా ఆర్ధిక సహాయం అవసరం అయినవారికి ముఖ్యమంత్రి సహాయనిధి మరింత చేయూతను అందించడం జరుగుతున్నదన్నారు. కష్టాల్లో ఉన్న పేదప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎ ంతో ముందుంటున్నారన్నారు. పేదప్రజలకు అవసరమైన సమయాలలో ఆదుకునేందుకు వారినుండి ఎ మ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, యంపీలు నుండి ఆయా ప్రజల కష్టాలను వివరిస్తూ కోరే ఆర్ధికసహాయానికి వెంటనే స్పందిస్తూ ఎ టువంటి ఆలశ్యం లేకుండా మంజూరు చేస్తున్నారన్నారు. గతంలో ఇంత త్వరితగతిన ఇంత పెద్ద మొత్తాలలో ఏప్రభుత్వం కూడా సహాయం అందించి ఉండలేదని ఆయన చెప్పారు. పేదప్రజలకు పెన్షన్లు అందించడం మొదలు ఇళ్లు అందించే వరకూ అనేక కార్యక్రమాలను తెలుగుదేశం ప్రభుత్వం గత నాలుగేళ్లలో పెద్ద ఎ త్తున అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్ధికలోటు ఉన్నప్పటికీ దానిని ఒకసవాల్గా తీసుకుని పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తూ ఎ న్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. ఇందులోభాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన చంద్రన్న భీమా పేదకుటుంబాలకు ఒక ధీమా, భరోసా కల్పించేదిగా ఉందని ఆయన చెప్పారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు యస్వి. రంగారావు, కెంగం లక్ష్మణరావు, యం. రాము, జి. శివాజీ, తదితరులు పాల్గొన్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13300
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author