దండుకుంటున్న గొలుసు దుకాణాలు!

దండుకుంటున్న గొలుసు దుకాణాలు!
December 25 16:19 2017
అనంతపురం,
అనంతపురం జిల్లాలోని పలు మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతున్నట్లు ఇటీవలిగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గొలుసు దుకాణాల్లో ఈ దందా సాగుతున్నట్లు మద్యంప్రియులు చెప్తున్నారు. విషయం తెలిసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు ఉదాసీనంగా ఉండడంతో అధిక ధరలకే మద్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. జిల్లాలోని వైన్ షాపుల తీరుతెన్నులు పరిశీలిస్తే సుమారు40శాతం దుకాణాలు బినామీ పేర్లతోనే ఉన్నాయని సమాచారం. వీటిలో 200లకు పైగా దుకాణాలు గొలుసు దుకాణాలుగా ఉన్నాయి. ఇవి లేకపోతే సగం వ్యాపారం లేనట్టే అట. ఈ షాపుల నిర్వహణపై ఎలాంటి అభ్యంతరాలు, గొడవలు రాకుండా ఎక్సైజ్, పోలీస్‌శాఖల సిబ్బందికి యజమానులు మామూళ్లు అందిస్తూ తమ పని కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తంగా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో షాపుల వారు ఎంత రేట్ ఫిక్స్ చేస్తే అదే ధర చెల్లించి సరుకు కొనాల్సిన పరిస్థితి వినియోగదారులది.
జిల్లాలో హిందూపురం, మడకశిర, కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఎక్సైజ్‌ కార్యాలయాల పరిధిలో 90 శాతం మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ఎమ్మార్పీ ధరలకు మద్యం అమ్మడం లేదన్న విమర్శలున్నాయి. ప్రతి దుకాణం ఎదుట బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలాంటివి కానరావు. ఎమ్మార్పీపై 10-20 శాతం అధికంగా అమ్మకాలు సాగిస్తున్నవారే అధికంగా ఉన్నారని మద్యం ప్రియులు చెప్తున్నారు. మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు చేపట్టకూడదన్న నిబంధన ఉన్నా అదీ గాలికి వదిలేశారని అంటున్నారు. మొత్తంగా ఎక్కడా నియమనిబంధనలు అమలుకావడంలేదని వివరిస్తున్నారు. ఈ దందాపై ఏ అధికారైనా ప్రశ్నిస్తే తమ పలుకుబడితో అడ్డుకుంటున్నారట మద్యం దుకాణాల నిర్వాహకులు. ఏదేమైనా ఎక్సైజ్ శాఖ ఈ విషయమై దృష్టి సారించి మద్యాన్ని అధిక ధరలకు విక్రయించే దందాకు అడ్డుకట్టవేయాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13354
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author