అభ్యర్ది ఎవరయినా సహకరించాలి : సీఎం చంద్రబాబు

అభ్యర్ది ఎవరయినా సహకరించాలి : సీఎం చంద్రబాబు
December 25 16:35 2017
అమరావతి,
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలుకు తుది గడువు రేపు కాగా అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయం ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. కర్నూలు ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశిస్తున్న ఆశావహులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కొద్ది సేపటి కిందట ముగిసింది. ఆశావహులతో విడివిడిగా భేటీ అయిన చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయితే, పార్టీ ఎవరికి టిక్కెట్ కేటాయించినా సహకరించాలని బాబు సూచించారు. అవకాశాలు దక్కని వారికి భవిష్యత్తులో అవకాశాలిస్తామన్న భరోసా ఇచ్చారు. అవకు కు చెందిన పార్టీ నేత చల్లా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేశా.. చంద్రబాబుకు కానుక ఇచ్చానని అన్నారు. పార్టీ కోసం నేను ఏ విధంగా కష్టపడుతున్నాననే అంశాన్ని చంద్రబాబుకు వివరించానని అయన అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నాకు టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తా.. వేరేవారికి టిక్కెట్ ఇస్తే గెలిపిస్తానని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13363
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author