దావోస్ సదస్సుకు హాజరు కానున్న ప్రధాని

దావోస్ సదస్సుకు హాజరు కానున్న ప్రధాని
December 25 17:10 2017
న్యూఢిల్లీ,
దావోస్ వేదికగా వచ్చే జనవరిలో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత ఈ సదస్సుకు భారత తరఫున హాజరుకానున్న తొలి ప్రధానిగా మోదీ నిలవనున్నారు. అయితే అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథి హోదాలో భారత ప్రధాని పాల్గోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులు, భారత్‌కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్తలు, నటులు, సీఈఓలు కడా ఈ సదస్సుకు హాజరవుతారు. వీరిలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దర్శకనిర్మాత కరణ్ జోహార్, ఐసీఐసీఐ సీఈఓ చందాకొచ్చర్‌ కూడా ఉన్నారు.1997లో జరిగిన దావోస్ శిఖరాగ్ర సదస్సులో నాటి ప్రధాన మంత్రి దేవెగౌడ పాల్గొన్నారు. ఆ తర్వాత భారత ప్రధానులు ఎవరూ ఆ కార్యక్రమంలో పాల్గోలేదు. గత జనవరిలో జరిగిన శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌ పిన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రపంచ వ్యాపారవేత్తలపై ప్రశంసలు కురిపించారు. అంతకు ముందు ఇదే సదస్సులో డొనాల్డ్ ట్రంప్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. గత వార్షిక సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ అనివార్య కారణాల వల్ల హజరుకాలేకపోయారు. స్విట్జర్లాండ్ పర్యటన, గణతంత్ర దినోత్సవ వేడుకల తీరికలేని షెడ్యూల్‌తో వెళ్లలేకపోయారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13385
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author