శిధిలావస్థలో బ్రహ్మంగారి రచనలు

 శిధిలావస్థలో బ్రహ్మంగారి రచనలు
December 25 17:45 2017
కడప, కర్నూలు,
 పోతులూరి వీర బ్రహ్మం కాలజ్ఞాన తాళపత్రాల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కడప జిల్లా చిట్వేలి మండలం నగరిపాడు శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో ఉంచిన పవిత్ర ప్రతులు శిథిలావస్థకు చేరుకొన్నాయి. బ్రహ్మేంద్రస్వామికి విరచించిన తాళపత్ర గ్రంథాల్లో ఒకటి రంగనాయకస్వామి మూలవిరాట్‌ సన్నిధిలో భద్రపరిచారు.దాదాపు మూడు శతాబ్దాల క్రితం నాటివి కావడంతో ఈ పత్రులు బాగా చీకిపోయాయి. వాటిని పరిరక్షించడానికి ఆలయ కమిటీ ప్రయత్నిస్తున్నా, శక్తి చాలడం లేదు.ఇప్పటికీ అముద్రితంగానే ఉండిపోవడం వల్ల, ఈ గ్రంథంలో ఏమి ఉన్నదనేది తెలుసుకొనే అవకాశం లేకుండాపోయింది. ఈ ఆలయంలో భద్రపరిచిన గ్రంథ భాగాలు దాదాపు చిరిగిపోయిన స్థితిలో కనిపిస్తున్నాయి. తాళపత్రాలకు అటూఇటూ అమర్చిన చెక్క కవచంపై శ్రీరామ వీరా గురువే వీర బ్రహ్మణేనమః అని రాసి ఉంది. మరి, ఈ కాలజ్ఞాన గ్రంథం ఎలా రంగనాయకస్వామి ఆలయానికి వచ్చిందని ఆలయ పెద్దలను ఆరాతీయగా, ఆసక్తికరమైన అంశాలు తెలియవచ్చాయి
కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మం…. కర్నూలు జిల్లా బనగానపల్లెలోని కరిగిరెడ్డి అచ్చమ్మ సన్నిధి, కడప జిల్లాలోని సిద్దయ్యమఠం, బ్రహ్మంగారిమఠాలతోపాటు, చిట్వేలి మండలం నగరిపాడు శ్రీ రంగనాయకస్వామి ఆలయాన్నీ పోతులూరి వీరబ్రహ్మానికి చెందినదిగా పరిగణిస్తారు. ఆయన  జీవితకాలంలో చెప్పిన తత్వాలను తాళపత్ర గ్రంథాలుగా ఆయన శిష్యులు రచించి ఈ ఆలయాల్లో భద్రపరిచారు. నగరిపాడు ఆలయానికి పవిత్ర ప్రతులు చేరాయి. వాటిని కాపాడుకోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మిచారు. ఆయన ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు- అనే విషయాలపైన వాదోపవాదాలు వున్నాయి. క్రీస్తు శకం 1600 – 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి అంచనా. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది…. ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు.రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చినవారే. చిరంజీవి, విజయశాంతి, జమున- ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీది నటులు రాజకీయాల్లో ప్రవేశించారు.. అలాగే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13399
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author