31న రజనీకాంత్ రాజకీయ కార్యాచరణ ప్రకటన

31న రజనీకాంత్ రాజకీయ కార్యాచరణ ప్రకటన
December 26 15:01 2017
చెన్నయ్
తమిళనాడు రాజకీయాల్లో ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న పరిణామాలు వాస్తవ రూపం దాల్చేందుకు సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. ఎంతగానో ఎదురు చూస్తున్న తలైవా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే అనిపిస్తోంది. ఈ మేరకు స్వయంగా రజనీకాంత్ సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 31న రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానంటూ స్పష్టం చేశారు. అభిమాలనులతో నేటి నుంచి ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెలఖరు వరకు కొనసాగే ఈ సమావేశాల చివరి దినాన ఆయన పార్టీని ప్రకటించనున్నారు.సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావడానికి ఇప్పటికే ఆలస్యం చేశానని రజనీకాంత్ వెల్లడించారు. అభిమానులతో సమావేశంలో రజనీ మాట్లాడుతూ రాజకీయాలు తనకి కొత్తకాదని పేర్కొన్నారు. నేను రాజకీయాల్లోకి రావడమంటే విజయం సాధించినట్టేనని ఆయన తెలిపారు.
ఒక్కసారి యుద్ధంలోకి దిగితే… గెలిచి తీరాలంటూ తన అభిమానులకు మార్గనిర్దేశం చేశారు. సూపర్ స్టార్ కావాలనే ఉద్దేశంతో తాను సినిమాల్లోకి రాలేదని చెప్పారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమంటపంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీపై రజనీ స్పష్టతనివ్వడంతో, ఆయన అభిమానులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశం మారోసారి చర్చనీయమవుతోంది.ఈ సమావేశాల్లో రోజుకు వెయ్యి మంది అభిమానులను రజనీ కలవనున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఊహించని ఫలితాలు రావడంతో రజనీ మళ్లీ జనంలోకి రావాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
అభిమానులతో మాటామంతీ సందర్భంగా రజనీ అనేక అంశాలపై మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తన సినీ – జీవిత అనుభవాలను ఆయన గుర్తు చేసుకుంటున్నారు. చిత్ర రంగంలోకి హీరో అవ్వాలని రాలేదని – అభిమానులే తనను హీరోను చేశారని రజనీ అన్నారు. హీరోగా తన తొలి సంపాదన రూ.50వేలని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రావాలంటే లాభనష్టాలు – లోతుపాతులు బేరీజు వేసుకోవాలని – యుద్ధంలో గెలవాలంటే వీరత్వం ఒక్కటే కాదు.. వ్యూహం ఉండాలని రజనీ తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13545
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author