‘ఆధార్‌’తో అడ్డగోలు విక్రయాలకు అడ్డుకట్ట

‘ఆధార్‌’తో అడ్డగోలు విక్రయాలకు అడ్డుకట్ట
December 27 11:29 2017
కరీంనగర్,
ఎరువుల పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం ఎరువుల పర్యవేక్షణ వ్యవస్థ (ఎఫ్‌ఎంఎస్‌)ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రతీ బస్తాకూ లెక్క ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వ్యవస్థ పరిధిలోకి ఎరువుల విక్రేతలను తీసుకువస్తోంది. దేశంలో జోరందుకున్న ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో తుది దశకు చేరువలో ఉంది. జిల్లాలో 264 ఫెర్టిలైజ్ దుకాణాలు ఉన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, డీసీఎంస్‌కు చెందిన 36 లైసెన్సులు ఉన్నవారినీ కలుపుకుంటే మొత్తంగా 300 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. వీరందరికి పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఈ-పోస్‌) యంత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 288 మందికి సంబంధించి ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయింది. 12 మందికి సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారు ఈ పరిధిలోకి రాలేదు. ఐడీలు లేని వారు వెంటనే కంపెనీలతో సంప్రదించి నమోదు చేయించుకోవాలని.. లేకుంటే యంత్రాలు వెనక్కు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఇక ఈ విధానం వల్ల ఎరువుల క్రయవిక్రయాల్లో అక్రమాలు గణనీయంగా తగ్గిపోతాయని అంటున్నారు.
ఎరువులు కొనేందుకు రైతులు తమ వెంట ఆధార్‌ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. విక్రయదారులు రైతుల ఆధార్ వివరాలు నమోదు చేసి వేలిముద్రలు తీసుకుంటారు. దీంతో రైతుకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా దిల్లీలోని ఎరువుల శాఖ కేంద్ర సర్వర్‌కు వెళ్తాయి. రైతుకు విక్రయించిన ఎరువులు రికార్డుల్లో నమోదవుతాయి. ఆ మేరకు మాత్రమే ఆయా కంపెనీలకు  రాయితీ అందుతుంది. దీంతో ఇష్టారీతి కొనుగోళ్లకు తెరపడుతుందని అంటున్నారు. డీలర్లకు సంబంధించి ఇప్పటి వరకు వారి వద్ద ఎరువుల నిల్వ ఎంత ఉంది. ఏ రోజు ఎంత విక్రయిస్తున్నారు… ఎంత మిగులు ఉందనే విషయాలనూ తెలుసుకోవచ్చు. తమ వద్ద నిల్వలు ఉన్నా లేవనిచెప్పడం.. నల్ల బజారుకు తరలించడం సాధ్యపడదు. కృత్రిమ కొరతను నివారించవచ్చు. ఎరువుల కంపెనీలు గతంలో రైతుల పేరు మీద ఇతర అవసరాలకు విక్రయించిన ఎరువులకు పెద్ద మొత్తంలో రాయితీ పొందేవి. ఇప్పుడు వాటికి తెరపడనుంది. రైతులకు మద్దతుగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13623
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author

view more articles

Related Articles