సాంకేతిక పద్ధతిలో వన్యప్రాణుల గణన

సాంకేతిక పద్ధతిలో వన్యప్రాణుల గణన
December 27 11:33 2017
ఖమ్మం,
పట్టణీకరణ, అభివృద్ధి నేపథ్యంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతుండగా మరికొన్ని కనుమరుగవుతున్నాయి. ఈ పరిస్థితిని గ్రహించిన తెలంగాణ అటవీశాఖ జంతు గణనకు శ్రీకారం చుట్టింది. ఉన్న కొద్దిపాటి వన్యప్రాణులను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహించారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ జంతువుల లెక్కను పక్కాగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. జనవరి మొదటి తారీఖు నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించి నెల రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఖమ్మం సర్కిల్‌ పరిధిలోని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 1,76,000 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది. ఖమ్మం డివిజన్‌ పరిధిలో ఖమ్మం, కారేపల్లి, మధిర, కూసుమంచి రేంజిలు, సత్తుపల్లి డివిజన్‌లో సత్తుపల్లి, తల్లాడ రేంజీలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ రేంజీలు ఉన్నాయి. ఈ రెంజీల పరిధిలో సమగ్ర సర్వే జరిపేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
ప్రస్తుతం అటవీ ఆక్రమణ, వేటగాళ్ల ఉచ్చులకు అధికశాతం వన్యప్రాణులు బలయ్యాయి. దుప్పులు, నెమళ్లు, తోడేళ్లు, పిల్లులు, పందులు, నక్కలు, అడవి గొర్రెలు, మనుబోతులు, కణుజులు తదితర వన్యప్రాణులు అడవిలో తలదాచుకుంటున్నాయి. ఇందులో చిన్న వాటిని మినహా మిగిలిన వాటిని వేటగాళ్లు ఉచ్చులతో బంధిస్తున్నారు. ఫలితంగా వన్యప్రాణాలు జనాభా గణనీయంగా పడిపోయింది. దీంతో ఉన్న కొద్దిపాటి జంతువులను కాపాడుకోవాలని అటవీ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మాంసాహార, శాఖహర జంతువులను విడివిడిగా లెక్కించనున్నారు. గుర్తించిన ప్రాణులకు సంబంధించి ‘ఎకలాజికల్‌ యాప్‌’ ద్వారా సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. ఉదయం ఆరుగంటల కల్లా అటవీ ప్రాంతానికి వెళ్లి రెండు గంటల పాటు ప్రాణుల ఆనవాళ్లను సేకరించాలి. సెల్‌ఫోన్‌ తో వాటి ఫొటోలను, ఇతర అంశాలను సేకరించి యాప్‌ ద్వారా సంబంధిత ప్రదేశం, సమయం వెంటనే అంతర్జాలంలో నమోదు చేయాలి. దీనివల్ల తప్పుడు నివేదికలకు చెక్ పడి పక్కా సమాచారం అందుతుంది. కంపార్ట్‌మెంట్‌ల వారీగా సిబ్బంది ఆయా ప్రదేశాల్లో తీసిన ట్రాంజక్టివ్‌ లైన్‌ల ద్వారా జంతుగణన చేయనున్నారు. ఖమ్మం, సూర్యాపేట డివిజన్‌ల పరిధిలో 60 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వన్యప్రాణుల సంరక్షణకు అధికారులు చేపడుతున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13626
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author