హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లలో కంపోస్ట్ యూనిట్లు

హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లలో కంపోస్ట్ యూనిట్లు
December 27 12:48 2017
హైదరాబాద్,
 నగరంలో బల్క్ గార్బెజ్ను ఉత్పత్తిచేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్హాళ్లలో తప్పనిసరిగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీచేసింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను 2017ను అనుసరించి 50కిలోల గార్బెజ్ను ఉత్పత్తిచేసే ప్రతి హోటల్, రెస్టారెంట్లు విధిగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిబంధన  విధించింది. దీనితో గ్రేటర్ హైదరాబాద్లో బల్క్ గార్బెజ్ను ఉత్పత్తిచేసే ప్రతి రెస్టారెంట్, ఫంక్షన్ హాళ్లలో విధిగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు అనేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే రోజు అధిక మొత్తంలో గార్బెజ్ను ఉత్పత్తిచేస్తే వారు జీహెచ్ఎంసీకి కలెక్షన్ చార్జీలు అందించాల్సి ఉంటుంది. అయితే దీనికి బదులుగా అధిక మొత్తంలో గార్బెజ్ను ఉత్పత్తిచేసే ప్రతి సంస్థ తమ ఆవరణలోని కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా గార్బెజ్ ఉత్పత్తి స్థలాల్లోని కంపోస్ట్ చేసుకోవాలని స్వచ్ఛ భారత్ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకుగాను అతితక్కువ విస్తీర్ణం భూమితో అంటే 40చదరపు అడుగుల భూమితో పాటు 200 అడుగుల వరకు స్థలంలో కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకునేవిధంగా తగు యూనిట్ల వివరాలు కూడా స్వచ్చ భారత్ మిషన్ అందించింది. ఇందుకుగాను ఒక్కో యూనిట్కు అయ్యే వ్యయాన్ని కూడా ప్రకటించింది. ఏఏ కంపెనీలు కంపోస్ట్ యూనిట్లను ఏ స్థాయిలో యూనిట్లను ఏర్పాటు చేసే వివరాలు స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ యూనిట్ల ఏర్పాటుకు ఏవిధమైన విద్యుత్ అవసరం ఉండదు. 20మెట్రిక్ టన్నలు కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని కూడా వివరించారు. నిర్వహణ భారంలేకుండా కేవలం యూనిట్లలో రోజువారి ఉత్పత్తి అయ్యే తడి చెత్తను వేయడం ద్వారా ఇది కంపోస్ట్ ఎరువులుగా అత్యంత సులువుగా మారే అవకాశం ఏర్పడుతుంది. అయితే కంపోస్ట్ ఎరువుల యూనిట్ల ఏర్పాటుకు ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ యూనిట్ల ఏర్పాటు అనంతరం వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువుల ద్వారా వచ్చే ఆదాయం పెట్టుబడికి రెట్టింపు సంవత్సరానికి వ్యయాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు తెలిపారు. కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు ద్వారా జీహెచ్ఎంసీ గార్బెజ్ కలెక్షన్కు అందించే చార్జీలు తగ్గడమే కాకుండా గార్డెనింగ్, మొక్కల పెంపకంకు అవసరమైన ఎరువుల ఉత్పత్తి అవుతుందని జీహెచ్ఎంసీ బల్క్ గార్బెజ్ ఉత్పత్తి దారులను చైతన్యపరుస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ -2018లో కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు కూడా తగు మార్పులను స్వచ్ఛ భారత్ మిషన్ కూడా ప్రత్యేకంగా కేటాయించింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13634
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author