దిల్ రాజు కు సక్సెస్ ఇయర్ గా 2017

దిల్ రాజు కు సక్సెస్ ఇయర్ గా 2017
December 27 13:23 2017
హైద్రాబాద్,
ఒకటా.. రెండా ఆరు సినిమాలు తీశాడు దిల్ రాజు. నిర్మాతగా సూపర్ సక్సెస్ అయ్యాడు. డబ్బులకు డబ్బులు వచ్చాయి. పేరుకు పేరు తెచ్చాయి. అందుకే తమ సినిమాల్లో నటించిన వారినంతా ఒక చోటకు చేర్చే ప్రయత్నం చేశారు నిర్మాత దిల్ రాజు. ప్రత్యేక కార్యక్రమాన్ని న్యూ ఇయర్ ముగింపు సందర్భంగా నిర్వహించారు. ‘శతమానం భవతి’, ‘నేను లోకల్‌’, ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎంసీఏ’ చిత్రాలను దిల్ రాజు నిర్మించాడు.. ఇప్పుడు ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కాసుల వర్షం కురిపించాయి. అందుకే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ‘మోస్ట్‌ సక్సెఫుల్‌ ఇయర్‌ (2017)’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. పలువురు నటులు, దర్శకులు హాజరై దిల్ రాజు గురించి మాట్లాడారు. ఇది చాలా ప్రత్యేకమైన వేడుక. ఇలాంటి ఈవెంట్‌ ఎప్పుడూ రాదని స్టైయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్‌లో పనిచేయడం నిజంగా నా అదృష్టం. డీజే సక్సెస్‌ ఊరికే రాలేదని చెప్పారు. డీజే షూటింగ్‌ సమయంలోనే ఆయన సతీమణి మరణించారు. దిల్‌ రాజుకి మంచి సక్సెస్‌ రావాలని గట్టిగా కోరుకున్నా. ఎంతో బాధతో కుంగిపోయిన ఆయనకు ఈ ఆరు విజయాలు రావడం అదృష్టమని చెప్పారు అల్లు అర్జున్.  యువరాజు ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు. ఈ దిల్‌ రాజు ఆరు సినిమాలు హిట్‌ కొట్టారని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. ప్రపంచంలో డబ్బు మాత్రమే సంపాదించాలని ప్రయత్నిస్తే ఎవరూ సంపాదించలేరు. ప్యాషన్‌తో పనిచేస్తే డబ్బులు అవే వస్తాయి. ఈ ఏడాది ఆయన ప్యాషన్‌కు భగవంతుడు ఇచ్చిన వరం ఈ ఆరు విజయాలని మరింకొందరు ప్రముఖులు అన్నారు. అసలు ఇలాంటి ఈవెంట్ జరపడమే ఒక ప్రత్యేకం అని చెప్పాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13652
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author