మజ్లీస్ మతతత్వ పార్టీ 

మజ్లీస్ మతతత్వ పార్టీ 
December 27 16:23 2017
హైదరాబాద్,
హైదరాబాద్ పాత బస్తీలో మజ్లిస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మజ్లీస్ పార్టీ  అన్య మత దేవుళ్ళను విమర్శిస్తూ పబ్భం గడుపుతుందని ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు  మాజీ  కార్పొరేటర్  ఖాజా బిలాల్ హమ్మద్ బుధవారం వెల్లడించారు. మజ్లీస్ ఈ  మధ్య  ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని అయన ఆరోపిపంచారు.  మతాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. పాతబస్తీ అభివృద్దికి ఆటంకం కలిగిస్తూ, మెట్రో రైలుకు కుడా ఎంఐఎం అడ్డుకుందని అయన విమర్శించారు. త్వరలో  1500 మంది  అనుచరుల తో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు అయన వివరించారు.
మజ్లీస్ పార్టీ వల్లనే నాపైన రౌడీ షీట్, పీడీ యాక్ట్ లు నమోదయ్యాయి..పాస్ పోర్ట్ కూడా రద్దు అయ్యిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు. బిజెపిని గెలిపించేందుకే ఉత్తర్ ప్రదేశ్,మహారాష్ట్రలలో ఎంఐఎం పోటీ చేసిందని అన్నారు. మజ్లీస్ నియంతృత్వ పార్టీ.. ముస్లింలను రెచ్చగొట్టి లబ్దిపొందుతుందని మండిపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీలో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ దశాబ్దాల కాలంగా చక్రం తిప్పుతున్నది. ఆ పార్టీ చెప్పిందే పాతబస్తీలో చట్టం.. చేసిందే పాలన. ఆ పార్టీ అనేకంటే ఆ పార్టీ అగ్ర నేతలు అసదుద్దీన్ ఓవైసి, అక్బరుద్దీన్ ఓవైసి లదే హవా. వారే అక్కడ అన్నీ. పాతబస్తీని కనుచూపుతోనే వారు శాసించే స్థితి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతున్నది. వారి చేతుల నుంచి పాతబస్తీ జారిపోతున్న వాతావరణం నెలకొంది. తాజాగా పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. మజ్లిస్ కు రాజీనామా చేశారు. దీంతో పాతబస్తీలోనే కాదు తెలంగాణ అంతటా ఈ పరిణామాలపై తీవ్ర చర్చనీయాంశమైంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13670
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author