అంధత్వం..కాదు దేనికి అనర్హం

అంధత్వం..కాదు దేనికి అనర్హం
December 27 16:30 2017
కర్నూలు,
అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న.. కష్ట పడడానికి  బద్దకిస్తాం.. ఏదో వంకతో తప్పించుకుంటాం. కానీ కర్నూలు జిల్లా కు చెందిన ఓ వ్యక్తి కి చూపు లేదు.. పైగా పోలియో వచ్చి ఓ చేయి కూడా పనిచేయడం లేదు.. కానీ అతడు ఏనాడు  ఆత్మస్తైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతున్నాడు..
ఇతని పేరు మాబాష..  గుడ్డివాడు మరియు కుడి చేయి పోలియో వచ్చి బలహీనంగా ఉంది. కళ్లు లేకపోయిన కుడిచేయి బలహీనంగా ఉన్న అతను ఏ నాడూ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఏనాడు చింతిస్తూ కూడా కూర్చులేదు. 18 సంవత్సరములుగా ఇంట్లోనే కాయకూరలు వ్యాపారం చేస్తూ తన కాళ్లపై తాను నిలబడుతూ నలుగురికి ఆదర్శంగా నిలిచాడు.కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ హానీఫ్, శవాసమ్మ దంపతులకు నలుగురు కుమారులలో మూడో కుమారుడు ఈ మాబాష. 4 సంవత్సరాల వయస్సులో మాబాష కు పోలియో సోకి కంటిచూపు కోల్పోయాడు. కుడిచేయి బలహీనమైనది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. చూపు లేని కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో అందరితో పాటు తాను అంటూ ఆత్మవిశ్వాసంతో ఇంటి దగ్గరే కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించాడు.
 మాబాష కు కంటి చూపు లేకపోయినా … దాదాపు 18 ఏళ్లుగా కూరగాయలు వ్యాపారం చేస్తూ.. ఏ రోజు  ఇబ్బంది పడలేదు. కూరగాయలు వ్యాపారంతో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉన్నాడు. వ్యాపార రీత్యా ఉదయం లేచినప్పటి నుంచి పత్తికొండ, గుత్తిలలోని కూరగాయల మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకొని వస్తాడు.  ప్రతి పనీ తానే స్వయంగా చేసుకొంటాడు. చూపులేకపోయినా.. ఏ నోటు ఎంత అనే విషయాన్ని చేతి వేళ్ళ ద్వారా కనుక్కుని.. టక్కున చెప్పేస్తున్నాడు. అన్ని పనులు చేసుకుంటూ.. అన్నదమ్ములకి ఏ మాత్రం తీసిపోకుండా నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు మాబాష.
అన్ని అవయవాలు సరిగా ఉన్న పని చేయలేని బద్ధకస్తులకు.. చూపులేని ఈ మాబాష.. అందరికి ఆదర్శంగా తీసుకోవాలి
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13677
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author