డిజిటల్ క్యాపిటల్ గా ఏపీ

డిజిటల్ క్యాపిటల్ గా ఏపీ
December 27 17:27 2017
గుంటూరు,
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఫైబర్ గ్రిడ్’ను జాతికి అంకితం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ‘ఫైబర్ గ్రిడ్’ ప్రాజెక్టును అమరావతిలో ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఏపీ ఫైబర్ అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఏపీ ఫైబర్ నెట్ పనితీరు గురించి మంత్రి నారా లోకేష్.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు వివరించారు.ఫైబర్ గ్రిడ్‌ ద్వారా రాష్ట్ర ప్రజలకు మూడు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫైబర్ నెట్‌తో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, 250 వరకు టీవీ చానళ్ల ప్రసారాల సదుపాయం అందుతుంది. అపరిమిత కాలింగ్, వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది. కేవలం రూ.149లతో ఈ సౌకర్యాలు పొందడం విశేషం. దీంతో ప్రపంచంలో అత్యంత చౌక ధరకు ఇంటర్నెట్‌ను అందించే రాష్ట్రంగా ఏపీ నిలవబోతుంది. ప్రపంచంలో మరెక్కడా ఇంత తక్కువ ధరకు ఇన్ని సేవలు అందించే బ్రాడ్‌బ్యాండ్‌ వ్యవస్థ ఉండదని విశ్లేషకుల మాట. ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా తరవాతి దశలో వినియోగదారులకు 500 టెలివిజన్‌ ఛానెళ్లు అందించాలని ప్రభుత్వం చూస్తోంది.ఒకే కనెక్షన్‌తో మూడు ప్రధాన సేవలు, ఇతర అనుబంధ సేవలు కల్పించాలనే ఆశయంతో ఆగస్టు 2015న ‘ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ సంస్థ’ను ప్రారంభించారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు తొలి దశను చంద్రబాబునాయుడు 2016 మార్చి 17న విశాఖలో ప్రారంభించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును నేడు రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్నది లక్ష్యం. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఈ సేవలు అందనున్నాయి. వచ్చే ఏప్రిల్‌నాటికి 25 లక్షల కుటుంబాలకు ఫైబర్‌ నెట్‌ సేవలు విస్తరించాలని ప్రభుత్వం చూస్తోంది.ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి మూలకు కనెక్షన్లు ఇస్తామని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం అమరావతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికే కాకుండా యావత్తు ప్రపంచానికే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దీనిలో ఎలాంటి అతిశయోక్తిలేదని చెప్పారు.ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ఎంతో అవృద్ధి చెందిందని చంద్రబాబు చెప్పారు. ‘ఈరోజు కొంతమంది ఇంటి దగ్గర కూర్చొని దర్జాగా కాఫీ తాగుతూ ఏకంగా రాష్ట్రపతితో మాట్లాడుతున్నారు. ఇదే టెక్నాలజీకి ఉండే ప్రత్యేకత’ అని చంద్రబాబు గర్వంగా చెప్పారు. అంతకుముందు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ పంచాయతీలు, అంగన్‌వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వీడియో కాన్ఫెర్స్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు మంత్రి నారా లోకేశ్ చూపించారు. దీన్ని ఉద్దేశించి చంద్రబాబు పై విధంగా మాట్లాడారు.ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తిచేయాలంటే రూ.5వేల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పారు. కానీ నిధుల కొరత రావడంతో ఓ కొత్త ఆలోచన వచ్చిందన్నారు. మనకు అందుబాటులో ఉన్న కరెంట్ పోల్స్ ద్వారా ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దీన్ని ఎనిమిది నెలలో రూ.333 కోట్లతో పూర్తిచేశామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, రూ.860 కోట్ల నిధులిచ్చి పంచాయతీల వరకు ఇంటర్నెట్‌ను వ్యాప్తి చేయాలని సూచించారని చెప్పారు. ఇప్పుడు దీనికి తోడు ఫైబర్ గ్రిడ్ ద్వారా పంచాయతీలకు హాట్‌స్పాట్ ద్వారా వైఫై సేవలు అందిస్తామని చంద్రబాబు చెప్పారు.రాష్ట్రంలోని ప్రతి మూలకు ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వడమే ధ్యేయమన్నారు. నెలకు రూ.149 కడితే ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సేవలను ప్రజలు ఆస్వాదించొచ్చని సీఎం వెల్లడించారు. ఇలాంటి సదుపాయం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని గర్వంగా చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని, టెక్నాలజీతో ఆ ఇబ్బందులను ఎదిరించి ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13712
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author