12 మంది మావోయిస్టుల అరెస్టు

12 మంది మావోయిస్టుల అరెస్టు
December 27 17:54 2017
మల్కన్ గిరి,
 చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు పెద్ద ఎత్తున పోలీసులకు దొరికిపోయారు. నక్సలైట్లు సమావేశమవుతున్నారని సమాచారం అందడంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మల్కన్గిరిలో 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కలిమెల, మాథిలి, చిత్రకొండ ప్రాంతాలలో వారిని అరెస్టు చేశారు. మల్కనగిరిలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మావోలు పట్టుబడినట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు వివిధ విభాగాలకు చెందిన వారని, పలువురు ఈ మధ్యకాలంలో జరిగిన ముగ్గురు వ్యక్తుల హత్యలో పాల్గొన్నారని తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13724
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author