పొందూరు ఖద్దరుకు నకిలీ ఖాదీ చీడ

పొందూరు ఖద్దరుకు నకిలీ ఖాదీ చీడ
December 28 09:37 2017
శ్రీకాకుళం,
కాకుళం జిల్లా పొందూరు ఖాదీ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని కీర్తి గడించింది. పొందూరు మాట వినగానే స్ఫురించేది ఖాదీయే. దేశవ్యాప్తంగా రెండు వేల ఖాదీ సంస్థలు ఉన్నప్పటికీ చుక్కల్లో చంద్రునిలా పొందూరు ఖాదీ నిలుస్తోందనడం అతిశయోక్తికాదు. దేశం మొత్తంమీద కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కొండ పత్తిని ఉపయోగించి ఖాదీ వస్త్రాలను తయారు చేస్తున్నారు. పొందూరు సన్నఖాదీని రూపొందించడానికి ముఖ్యంగా కావలసింది మాత్రం ఓ చేప ముల్లు అంటే ఆశ్యర్యం కలుగుతుంది. ఖాదీ తయారీకి ముఖ్యమైన కొండపత్తిలోని ఆకు పొల్లును తొలగించి దానిని ధగధగ మెరిసేలా చేసేది ఈ ముల్లే. వాలుగు అనే చేప దవడ కింది మీది భాగాలను శభ్రపరిచి ఎండలో ఆరబెట్టి నాలుగు ముక్కలుగా కోస్తారు. తరువాత ముక్కలను పెన్సిల్‌  సైజు కర్రలకు కట్టి దాని సహాయంతో గింజలో ఉన్న ముడి పత్తిని శుభ్రం చేస్తారు.
పొందూరు ఖాదీ సంస్థ పరిధిలోని 40 గ్రామాల్లోని వెయ్యిమంది వడుకు పని మహిళలు ఈ చేపముల్లును వాడుతున్నారు. బాణం వంటి సాధనంతో పత్తిని రాట్నంపై సన్నటి నూలు తీస్తారు. ఇక సన్నఖాదీ పాట్నూలు చీరల నేత పరిశ్రమ…. ఇక్కడి పట్టు శాలిపేటవాండ్రంగి వీధిలో విజయవంతంగా కొనసాగుతోంది. పాలకొండ సంతకవిటి చాటాయవలసల్లో న్యూ మోడల్‌ చరఖా ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. 100 మంది నేతవారు పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. 1972లో న్యూఢిల్లీలో ఆసియా 72 ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హస్తకళా ప్రదర్శనలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా పాల్గొని పొందూరు ఖాదీ ఉత్పత్తులను తిలకించి పులకించారు. గాంధీ మనుమరాలు తారాగాంధీ రెండుసార్లు ఇక్కడి పరిశ్రమను సందర్శించారు.  ఏటా కోటి రూపాయల విలువ చేసే వస్త్రాలను పొందూరు ఖాదీ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. పాట్నూలు పంచెలు, జరీ కుప్పడం చీరలు చాలా ప్రసిద్ధి కెక్కాయి. ఖాదీకి సమాంతరంగా ఉత్పత్తి అవుతున్న నకిలీ ఖాదీ ఈ పరిశ్రమను దెబ్బతీస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13743
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author