పురాతన చెరువులకు పూర్వవైభవం

పురాతన చెరువులకు పూర్వవైభవం
December 28 09:41 2017
కరీంనగర్,
మిషన్ కాకతీయ ప్రోగ్రాం కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. చెరువులకు పునర్వైభవం తీసుకురావాలన్న ఈ కార్యక్రమం లక్ష్యం దిశగా అడుగులేస్తోంది. కొన్నేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. నీటి వనరులు ఆశాజనకంగా ఉండడంతో బీడు భూములు పంటలకు నెలవుగా మారి సిరులను కురిపిస్తున్నాయి. చెరువులే జీవనాధరమైన మత్స్యకారులకూ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా జిల్లాలో గత మూడు విడతల్లో చేసిన పూడికతీత ఫలితంగా చెరువులు నిండుకుండలా మారాయి. కట్టల సామర్థ్య పనులు పటిష్టంగా చేపట్టడంతోపాటు పూడికను తొలగించడంతో ఆయకట్టు సాగుకు భరోసా కలుగుతోంది. 468 చెరువు పనులకుగాను రూ.130.12 కోట్లతో ప్రతిపాదనలు చేయగా ఇప్పటికే మూడువిడతల పనులను పూర్తిచేశారు. నాల్గో విడతకు రంగం సిద్ధమవుతోంది. చెరువుల అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు నీటిపారుదలశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
చెరువులు జలకళ సంతరించుకోవడంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా సాగుపై పెను ప్రభావం చూపలేదు. ఖరీఫ్‌ ఆరంభంలో వూరించిన వర్షాలు తర్వాత లేకపోయినా సాగు విస్తీర్ణం తగ్గలేదు. జిల్లాలో మూడు విడతల్లో పునరుద్దరణ చేసిన చెరువులన్నీ నీటితో నిండిపోయాయి. నీటి వనరులు అందుబాటులో ఉండడంతో ఖరీఫ్‌లో 42,060 హెక్టార్లు వరి వేయాల్సి ఉండగా ఏకంగా 48,825 హెక్టార్లలో సాగైంది. పత్తి పంట 37,959 హెక్టార్ల సాధారణ సాగుకుగాను 39,662 హెక్టార్లలో సాగు చేశారు. అంటే వర్షం సరిగ్గా లేకున్నా సాగు విస్తీర్ణం ఏ మాత్రం క్షీణించలేదు. చాలా చెరువుల్లో నీరు ఉండటంతో రబీ పంటలను కూడా సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. చెరువుల పునరుద్ధరణతో సాగునీరుకు ఢోకా లేకుండా ఉండడంతో కరీంనగర్ రైతాంగం హర్షం వ్యక్తంచేస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13746
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author