ఏకాదశికి భారీ భద్రత

 ఏకాదశికి భారీ భద్రత
December 28 13:08 2017
తిరుమల,
వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలకు తిరుమల కొండకు తరలివచ్చే సామన్యభక్తులకు భద్రత విషయంలో ఎక్కడా రాజీ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి సివిఎస్వో  ఆకే రవికృష్ణ అన్నారు..ఈ సందర్భంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లను విజిలెన్స్ అధికారులతో కలసి ఆయన తనిఖీ చేశారు. అదేవిధంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లో పరిశీలన చేసారు..డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి సందర్భంగా 1500 మంది నిఘా, భద్రతా సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. సిసి కెమెరాల నిఘాతో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రత కల్పిస్తామన్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తు విధులు చేపట్టనున్నట్లు తెలిపారు.
తిరుమలకు   ముప్పు  ఉన్న నేపథ్యంలో తిరుపతి ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరక్కుండా పటిష్డ భద్రతా చర్యలు తీసుకున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ మహంతీ తెలిపారు. వైకుంఠ ఏకాదశీ కివచ్చే విఐపీల నుండి సామాన్య భక్తులకు ఏ విదంగా ఇబ్బందులు లేకుండా బందోబస్థు చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఆలయం వద్ద గట్టి భద్రతాపరమైన చర్యలు కొనసాగుతాయన్నారు. ఏకాదశి రోజు నుండి న్యూ ఇయర్ అయిపోయే వరకు అదనపు బలగాలతో రక్షణ మరియు భద్రతా చర్యలు ఉంటాయన్నారు. అందరూ పోలీసులకు ఈ విషయంలో సహకరించాని విజ్జ్యప్తి చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13763
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author