జాదవ్ భార్యను ఇబ్బంది పెట్టడంపై లోక సభలో ప్రకటన

జాదవ్ భార్యను ఇబ్బంది పెట్టడంపై లోక సభలో ప్రకటన
December 28 15:13 2017
న్యూఢిల్లీ,
గూఢచర్యం కేసులో అరెస్టయి పాకిస్థాన్‌లో బందీగా ఉన్న భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ భార్య ధరించిన షూలను పాక్ ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మరో వైపు ఘటనపై లోకసభలో సుష్మ స్వరాజ్ ప్రకటన చేశారు. ఇస్లామాబాద్‌లో జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన ఆయన్ని కలిసిన సంగతి తెలిసిందే. మానవతా కోణంలో ఆలోచించి కుల్‌భూషణ్‌ను చూడటానికి అతని తల్లి, భార్యకు అనుమతి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోన్న పాక్.. వారిద్దరినీ చాలా ఇబ్బంది పెట్టింది. అక్కడి పాక్ అధికారులు జాదవ్‌ను ఒకవైపు.. అతని తల్లి, భార్యను ఒకవైపు కూర్చోబెట్టి మధ్యలో గాజు గోడ అమర్చారు. కనీసం ముట్టుకోనివ్వలేదు.అంతేకాకుండా చేతన, అవంతిలను వారు వచ్చిన వేషధారణలో జాదవ్‌తో మాట్లాడనివ్వలేదు. జాదవ్ భార్య చేతనను బొట్టు తీసేయమన్నారు. గాజులు, మంగళసూత్రం తీసేయాలని ఆదేశించారు. ఆమె కట్టుకొచ్చిన బట్టలను మార్చేయమన్నారు. తల్లి అవంతిని కూడా బొట్టు చెరిపేయమన్నారు. ఆ తరవాత జాదవ్‌తో మాట్లాడించారు. జాదవ్ భార్య చేతనను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఆమె షూస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అనుమానించదగినది ఏదో ఉందని వాటిని ఇప్పుడు ఏకంగా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది.కుల్‌భూషణ్ భార్య, తల్లిని తాము అవమానించినట్లు భారత్‌ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి పాక్ వాదిస్తోంది. జాదవ్‌ భార్య ధరించిన షూస్ తీసుకున్న మాట వాస్తవమేనని పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె పాదరక్షలను తీసుకున్నట్లు పాక్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ తెలిపారు. ఆ షూస్‌లో ఏదో ఉందని.. వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాటికి బదులుగా జాదవ్‌ భార్యకు మరో పాదరక్షల జత ఇచ్చామని చెప్పారు. వారి వద్ద నుంచి తీసుకున్న ఆభరణాలను కూడా తిరిగిచ్చేశామని చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13775
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author