అనంతలో తమ్ముళ్ల వార్

అనంతలో తమ్ముళ్ల వార్
December 28 15:50 2017
అనంతపురం,
అనంతపురం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం వాడి వేడిగా సాగింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి నివాసంలో జరిగిన సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయ్యారు. అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దేవినేని ఉమ, మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కిష్టప్ప తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మేయర్, జేసీ వర్గాలు మరోసారి యుద్ద వాతావరణం తీసుకువచ్చాయి. అనంతలో పార్టీకి సహకరించని ఒక అధికారిని బదిలీ చేయాలని మెజార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఆ అధికారిని బదిలీ చేయకపోతే కష్టమని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు మంత్రి దేవినేని ఉమను కోరారు. తర్వాత అసలు రగడ ప్రారంభమైంది. ఇటీవల తాడిపత్రిలో చోటు చేసుకున్న వివాదం తెరపైకి వచ్చింది. మంత్రులు తెలివిగా తాడిపత్రి సంఘటనపై ఎమ్మెల్యేలతో విడివిడిగా సమాచారం తెలుసుకున్నారు. అనంతపురం మేయర్ స్వరూప ఎంపీ జేసీని రాక్షసుడిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన జేసీ అనుచరుడు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, మేయర్ స్వరూపకు ఫోన్ చేసి బూతులు తిట్టారు. ఫలితంగా మేయర్ స్వరూప తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అనుచరుడిని అరెస్ట్ చేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్లోనే వీరంగం వేశారు. సిఐతో మాట్లాడంటూ ఎస్ ఐ పై చిందులు తొక్కారు. ఫలితంగా తాడిపత్రిలో అసలు ఏం జరిగిందన్న దానిపై మంత్రులు జాగ్రత్తగా విషయం తెలుసుకున్నారు.  అందరి ముందు రచ్చ వద్దని మంత్రులు ఒకరి తర్వాత ఒకరిని పిలిపించి మాట్లాడారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం మేయర్ స్వరూపపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే మేయర్ ను వదిలి పెట్టేది లేదన్నారు. దీంతో మంత్రుల జేసీని సముదాయించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వాస్తవాలను వారికి తెలిపారు. మేయర్ స్వరూప వెనక్కు తగ్గలేదు. మంత్రుల ఎదుట తన వాదనను విన్పించారు. ప్రతి పనికీ జేసీ దివాకర్ రెడ్డి అడ్డుతగులుతున్నారని చెప్పారు. విషయాన్ని ఇంతటితో వదిలేయండి. లేకపోతే ఇద్దరి పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రులు చెప్పి పంపారు. లేకపోతే గొడవ మరింత పెద్దది అయ్యేది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13790
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author