వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ కు వేదిక కానున్న హైదరాబాద్ నగరం

వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ కు వేదిక కానున్న హైదరాబాద్ నగరం
December 28 16:24 2017
హైదరాబాద్,
తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ పతంగుల పండుగ కు అనుబందంగా వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ కు హైదరాబాద్ నగరం వేదిక కానుంది.  వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహాణలో  భాగంగా  తెలంగాణ టూరిజం , సాంస్కృతి శాఖ అధికారులు వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ నగరంలో నివసించే వివిధ రాష్ట్రాల, దేశాల  ప్రజల సాంస్కృతిక  అంశాలను , ఆహరపు అలవాట్లను ప్రతిబింబించే విధంగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ ను రూపోందించాలని నిర్ణయించారు. దేశంలోని ఒక్కో రాష్ట్రం ఒక్కో ప్రత్యేకత కలిగిన స్వీట్లు  ఉన్నాయని  వాటిన్నంటిని ఒకే చోట ప్రధర్శించటం వల్ల అయా రాష్ట్రాల ప్రజల మద్య సన్నిహితం, పరస్పర గౌరవాన్ని పెంచటం ఈ స్వీట్ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యంగా ఈ  ఫెస్టివల్ ను నిర్వహించ బోతున్నారు.జనవరి 13  తేది నుండి 15 వ తేది వరకు సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రపంచ పతంగుల పండుగ కు అనుబందంగా ఈ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు సమావేశంలో పాల్గోన్న ప్రతినిధులకు  టూరిజం , సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. వివిధ రాష్ట్రాల ,  దేశాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులను ఈ స్వీట్ ఫెస్టివల్ భాగస్వామ్యం చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక పై  ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. ప్రపంచ తెలుగు మహాసభల విజవంతం కావటం వల్ల అదే స్థాయిలో అంతర్జాతీయ పతంగుల పండుగ తో పాటు స్వీట్స్ ఫెస్టివల్ ను నిర్వహించేవిధంగా కార్యాచరణ ను రూపోందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచంలో మెుట్టమెుదటి సారిగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ కు గ్లోబల్ సిటి గా రూపాంతరం చేందుతున్న మన హైదరాబాద్ నగరం వేదిక కాబోతుంది. వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ లో దేశంలో సుమారు 25 రాష్ట్రాలకు సంబందించిన స్వీట్ల ను ఒకే చోట అందించటం ఈ ఫెస్టివల్ విశేషంగా చేప్పవచ్చు.దాదాపు ప్రతి రాష్ట్రం నుండి 50 వివిధ  రకాల స్వీట్లు ను ప్రధర్శించటం  తోపాటు 1000 రకాల స్వీట్లు ను  అమ్మకానికి కుడా అందించబోతునారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వీట్ ఫెస్టివల్ లో అయా రాష్ట్రాల , దేశాల అసోసియేషన్లు లోని సభ్యులు తయారు చేసిన సాంప్రదాయ స్వీట్లు ఈ ప్రధర్శనలో ప్రధాన ఆకర్ణణ గా నిలువబోతుందన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ లో పతంగుల పండుగ , వినోదం, సాంప్రదాయ  ఆహారం అనే అంశాల లక్ష్యంగా కార్యచరణ ను రూపోందించాలని నిర్నఎంచారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పతంగుల పండుగ తోపాటు స్వీట్స్ ఫెస్టివల్ కు సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానం వేదిక కానుందని, సుమారు లక్ష  మంది ఈ ఫెస్టివల్ కు హజరు ఆయ్యే అవకాశం వుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13802
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author