పేద బ్రాహ్మణులకు హెల్త్ కార్డులు

పేద బ్రాహ్మణులకు హెల్త్ కార్డులు
December 28 19:29 2017
హైదరాబాద్,
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మొదటి జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మొదటి విడతగా 200 మంది బ్రాహ్మణులకు ఆరోగ్య భీమా పథకం క్రింద హెల్త్ కార్డులను అందిస్తున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్,  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణా చారి తెలిపారు.  గురువారం సచివాలంయలో 100 మంది బ్రాహ్మణ లబ్దిదారులకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో హెల్త్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ వైస్ చైర్మన్  వనం జ్వా లా నర్సిహ్మరావు, ఢిల్లీ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. ఎస్. వేణు గోపాలచారి, సభ్యులు యం.ఎల్.సి. పురాణం సతీష్, రాంమోహన్ తదితర సభ్యుల తో పాటు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ రీజినల్ మేనేజర్  జి.సరళ , సీనియర్ డివిజనల్ మేనేజర్ జి.సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా.కె.వి.రమణా చారి మాట్లాడుతూ న్యూఢిల్లీ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.ఎస్ వేణుగోపాల చారి చైర్మన్ గా యం.ఎల్.సి శ్రీ పూరణం సతీష్ కుమార్ , శ్రీ సి.ఎల్. రాజ్యం సభ్యులుగా ఉన్న కమిటీ పలు బ్రాహ్మణ సంఘాలు , అసోసియోషన్లతో సమావేశమై ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలతో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువ రేటుకు కోటేషన్ ఇచ్చి నందుకు వారికి ఈ బాధ్యతను అప్పగించినట్టు ఆయన తెలిపారు. వంద మంది బ్రాహ్మణ లబ్ధిదారులకు ఈ రోజు హెల్త్ కార్డులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులు  వనం జ్వాలా నర్సింహ్మ రావు మాట్లాడుతూ 1000 రూ. లతో ఇన్స్ రెన్స్ చేస్తే 3900 రూ. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చెల్లిస్తుందన్నారు. ఏడాది పాటు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. జర్నలిస్టులు, ఉద్యోగస్తులకు ప్రభుత్వం కార్పొరేట్   తరహలో వైద్యాన్ని అందిస్తున్నట్లు గానే పేద బ్రాహ్మణులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పం తో హెల్త్ కార్డులు జారీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కుటుంబంలో 4 గురికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఏడాదికి 2 లక్షల రూపాయల వరకు వైద్యసేవలు పొందవచ్చన్నారు.
వేణుగోపాలచారి మాట్లాడుతూ 19 నుండి 60 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరు ఈ హెల్త్ పథకం కింద అర్హులన్నారు. 60 సంవత్సరాల పైబడిన వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సి.యం.ఆర్.ఎఫ్ ద్వారా 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తామన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆదాయ, కులధృవీకరణ పత్రాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పురాణం సతీష్ మాట్లాడుతూ దేశలోనే మొదటి సారి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు రాష్ట్ర బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికే దక్కిందన్నారు. బ్రాహ్మణులలో కూడా ఎందరో నిరుపేదలు ఉన్నారని వారిని ఆదుకొనుటకు అక్షయ నిధిని ఏర్పాటు చేశామని ఉన్నతస్థానంలో ఉన్న బ్రాహ్మణులు, పేద బ్రాహ్మణులకు  చేయూత నందించడానికి విరాళాలు అందించాలని సూచించారు. అక్షయ నిధికి తన వంతుగా లక్షా ఒక వెయ్యి నూట పదహార్లు అందించారు. అదే విధంగా శ్రీ చకిలం అనిల్ కుమార్ లక్షా నూట పదహారు రూపాయల చెక్కును బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డా.కె.వి.రమణాచారికి అందించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13819
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author