యాదాద్రి లో ముక్కోటి ఏకాదశి  ఏర్పాట్లు

యాదాద్రి లో ముక్కోటి ఏకాదశి  ఏర్పాట్లు
December 28 22:49 2017
యాదాద్రి,
ముక్కోటి ఏకాదశి, అధ్యయనోత్సవాల సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి, యాదాద్రి పాతగుట్టలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు ఆలయ అధికారులు.  యాదాద్రి క్షేత్రంలో, యాదాద్రి పాతగుట్టలో లక్ష్మీసమేతంగా నరసింహస్వామి ఉత్తర ద్వారదర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో పాతగుట్టలో కుడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉదయం 6:45 నుంచి ఉదయం 9 గంటల వరకు దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారదర్శనం ఇవ్వనున్నారు. యాదాద్రి కొండపైన సరైన సౌకర్యాలు లేని కారణంగా భక్తులు పాతగుట్టకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో, వచ్చే భక్తుల కోసం ఉత్తర ద్వారం వద్ద స్థలాన్ని చదును చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరోవైపు యాదాద్రి క్షేత్రంలో, పాతగుట్టలో ఆరు రోజుల పాటు స్వామివారి అధ్యయనోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అందుకనుగుణమైన ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమైనారు ఆలయ అధికారులు. ఈ ఆరు రోజుల పాటు స్వామివారి నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమాలను రద్దు చేశారు. ఈ ఆరు రోజుల పాటు జరిగే అధ్యయనోత్సవాల సందర్భంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేయనున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13847
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author