త్వరలో ఏపీ హైకోర్టు : కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ 

త్వరలో ఏపీ హైకోర్టు : కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ 
December 28 23:00 2017
న్యూఢిల్లీ,
ఏపీకి హైకోర్టు ఎర్పాటు పై లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద గురువారం ప్రకటన  చేసారు. హైకోర్టు విభజనపై స్పష్టమైన తేదిని ప్రకటించలేము. తాత్కాలికంగా మార్చగలం కాని శాశ్వతంగా మార్చాలి అంటె సమయం పడుతుందని అన్నారు.  హైకోర్టు విభజన జరిగే వరకు జడ్జిల నియామకం అపాలన్న తెరాస ఎంపీ  జితెందర్ రెడ్డి కు సమాధానమిస్తూ జడ్జిల నియామకం పై మేము నిర్ణయం తీసుకోలేం.  కోలిజియం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసారు. హైకోర్టు కొత్త భవనం నిర్మాణానికి కొంత సమయం పడుతుంది కావున ఏపీ, తెలంగాణ పరస్పరం గౌరవభావంతో ఉండాలని సూచించారు. ప్రస్తుతమున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుంది. ఏపీకి నూతన హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నిధులిచ్చాం. హైకోర్టు కోసం ఏపీ సీఎం చంద్రబాబు స్థలం కేటాయించాల్సి ఉందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మొత్తానికి   హైకోర్టు విభజన అంశాన్ని సుప్రీం కోర్టు చూసుకుంటుందన్నారు. ఈ దశలో తెలుగుదేశం ఎంపీలు కలుగజేసుకోవడంతో లోక్ సభలో వాగ్వాదం చెలరేగింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13859
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author