ఊహించని మలుపులు తిరుగుతున్న  ట్రెజరీ స్కాం

ఊహించని మలుపులు తిరుగుతున్న  ట్రెజరీ స్కాం
December 28 23:47 2017
విశాఖపట్టణం,
వైద్య,ఆరోగ్యశాఖ, ఖజానాశాఖల్లో తీవ్ర సంచలనం సృష్టించిన చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. దీనికి కీలక సూత్రధారి అయిన ఖజానా స్థాయి ఉన్నతాధికారే ఈ కుంభకోణంపై గతంలో విచారణ అధికారిపై నియమించింది. దీంతో విశాఖ, చింతపల్లి ట్రెజరీల్లో వారం రోజులపాటు అన్ని రికార్డులను పరిశీలించి తప్పుడు నివేదికలను సైతం సమర్పించారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి తానేనని గుర్తించిన విచారణ అధికారుల బృందం ఇటీవల ఆయన్ని విచారించి అనకాపల్లి క్రైం డిఎస్‌పి, సిఐడి అధికారుల ఆధ్వర్వంలో అరెస్టు చూపారు. దీంతో ఈ కుంభకోణం కథలో ఇక మిగిలింది ఉన్నతాధికారుల పాత్రేనని తేలడంతో వారిని సైతం విచారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.  గత ఖజానా అధికారిగా పనిచేసిన గీతాదేవిని ప్రత్యేక విచారణ నిర్వహించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడంతో విషయం తెలుసుకున్న ఆమె ప్రస్తుతం సెలవుపై వెళ్ళినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె విజయనగరంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ కుంభకోణం కథకు సంబంధించి గీతాదేవిని ఇక్కడ నుంచి విజయనగరంనకు బదిలీ కూడా చేశారు. అయితే గత వారం రోజులుగా విజయనగరం కార్యాలయానికి కూడా వెళ్ళకపోవడంతో విదేశాలకు వెళ్ళినట్టు విచారణ అధికారుల బృందం గుర్తించింది. ఇది కాస్త త్వరలో ముగింపునకు చేరుకోనున్నందున ఆరోగ్యశాఖ, ఖజానాశాఖ అధికారుల సిబ్బంది ఏ నిమిషానికి ఎవరిపై చర్యలుంటాయోనని విధులకు హాజరవుతున్నారు. రాజకీయ వత్తిళ్ళతో సాగుతున్న ఈ కుంభకోణం కథ ఏ విధంగా కంచికి చేరుతుందో వేచిచూడాల్సి ఉంది.కథల్లో మిగిలింది కేవలం ఇద్దరు ఉన్నతాధికారులు మాత్రమేనని విచారణ అధికారులు భావిస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా స్వాహా చేయడంతో 50 మంది ఉద్యోగులను అరెస్టు చేసిన సంఘటన తెలిసిందే. తాజాగా ఈ కుంభకోణానికి సంబంధించి రూ.25 లక్షలకు జమా లెక్కలు తేలడంతో మరింత లోతుగా పరిశీలించిన విచారణ అధికారుల బృందం తాజాగా ఖజానాశాఖలో డిప్యూటీ ఉన్నతస్థాయి అధికారులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వైద్య,ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు 300 జిసిఎస్ పద్దు కింద చెల్లించాల్సిన జీతాలను రెండు, మూడుసార్లు చెల్లించినట్టుగా చూపి, ఏకంగా 13 కోట్ల మేర దారిమళ్ళించిన సంగతి తెలిసిందే. దీనిలోభాగంగా ఇప్పటి వరకు ఖజానాశాఖ, ఆరోగ్యశాఖల్లో ఉద్యోగులు, తమ సిబ్బందిని అరెస్టు చేయగా ఇక కేవలం ఉన్నతాధికారుల పాత్ర మాత్రమే ఉండటంతో వారిని కూడా విచారణ చేసి త్వరలోనే అరెస్టు చూపనున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాజకీయ పలుకుబడి, విచారణ అధికారులపై తీవ్ర వత్తిళ్ళు తీసుకువచ్చి గడచిన రెండేళ్ళుగా సాగుతున్న ఈ కుంభకోణం కథ శుభం పలకనుందని విచారణ అధికారులు భావిస్తున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13868
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author