వెండి తెరపై జయ జీవితం

వెండి తెరపై జయ జీవితం
December 29 12:31 2017
చెన్నై,
బయోపిక్ లా కాలం ఇది. బాగానే ఆడుతున్నాయి. జనం వాటిని చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మరీ బయోపిక్ లు తీస్తున్నారు. సినీ పరిశ్రమలోనే కాదు.. తమిళ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు జయలలిత. తన వ్యక్తిగత జీవితం గురించి అనేక రహస్యాల పుట్ట. అసలు సంగతి ఏమి చెప్పకుండానే కన్నుమూశారామె. జయలలిత చనిపోయినా అమ్మ మరణం పై చెలరేగిన రగడ చల్లారలేదు. అసలు ఇప్పట్లో అది చల్లారదు. అమ్మగా.. విప్లవ నాయకిగా  తమిళ ప్రజల ప్రేమను పొందిన జయలలిత జీవితం వెండి తెరపై ఆవిష్కరం కానుంది. ఇందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.   అమ్మ బయోపిక్ తీసేందుకు బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భరద్వాజ్ ముందుకు వచ్చారు. తాను ఓ పబ్లిక్ మీటింగ్ లో జయలలితని కలిశా.. అప్పుడు ఆమె బయోపిక్ గురించి చెప్పాను. ఈ విషయం పై తర్వాత మాట్లాడమని జయలలిత చెప్పారు. కానీ ఆ తర్వాత మాట్లాడే అవకాశమే రాలేదని ఆదిత్య చెప్పారు. అమ్మ బతికున్నప్పుడు రెడీ చేసిన స్క్రిప్ట్ లో మార్పులు చేసి.. తాజా స్క్రిప్ట్ తో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జయలలిత బయోపిక్ ను తీయనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు.  ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి లేక ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్  మొదలు పెట్టనున్నారు. ఇంతకు సినిమా పేరు “తాయ్‌: పురట్చి తలైవి” అని ఖరారు చేశారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో ఎవరు కనిపించనున్నారో ఇంకా రహస్యంగానే ఉంచారు. “తాయ్‌: పురట్చి తలైవి” అంటే విప్లవ నాయకి అని అర్ధం. రాంగోపాల్ వర్మ “జయలలిత శశికళ” ల బయోపిక్ ను తెరకెకిస్తాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదిరాక ముందే జయ బయోపిక్ విడుదల కానుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఇందులో జయలలిత కూతురు ఉందా లేదా అనే అనుమానాలకు సమాధానం చెబుతారంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13918
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author