టెన్త్ ఫలితాలపై హరీష్ క్లాస్

టెన్త్ ఫలితాలపై హరీష్ క్లాస్
December 29 16:16 2017
సిద్దిపేట,
పదవ తరగతిలో సిద్దిపేట జిల్లా వంద శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలవాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో జిల్లా స్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీష్‌రావు, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కలెక్టర్ వెంకట్రామరెడ్డితో పాటు డీఈవో హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పాఠశాలలకు ప్రభుత్వం తరపున అన్ని సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హాస్టల్‌లో ఉండని వార్డెన్‌లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గొప్ప నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయులు పట్టుదలగా పని చేస్తే సాధించలేనిది ఏమీ లేదని హరీష్‌రావు స్పష్టం చేశారు. పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా తీసుకుంటున్న చర్యలపై ప్రధానోపాధ్యాయుల వద్ద మంత్రి ఆరా తీశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13983
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author