రేపటి నుంచి రైతులకు 24 అవర్స్ ఫ్రీ కరెంట్

రేపటి నుంచి రైతులకు 24 అవర్స్ ఫ్రీ కరెంట్
December 30 11:05 2017
హైద్రబాద్,
 వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశ చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించబోతోంది.  ఇప్పటి వ‌ర‌కు ఏ రాష్ట్రం  ఈ ఘ‌న‌త సాధించ‌లేదు.  వ్యవ‌సాయానికి ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో 9 గంట‌ల ఉచిత విద్యుత్..మ‌రికొన్ని రాష్ట్రాల్లో 24 గంట‌లు ఉచిత విద్యుత్  రైతుల నుంచి బిల్లు వ‌సూలు చేస్తూ అందిస్తున్నాయి. ఉచితంగా 24గంటల వ్యవసాయ కరెంటు ఇచ్చేరాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే .వ్యవ‌సాయానికి నిరంత‌రాయ ఉచిత క‌రెంట్‌తోపాటు అన్ని రంగాల‌కు 24 గంట‌ల క‌రెంటు అందిచేలా స‌ర్వంసిద్ధంచేస్తోంది. తెలంగాణలో 23 లక్షల పంపుసెట్లకు నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ సంస్థలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. సీఎం ఆదేశాల మేరకు జనవరి ఫస్ట్‌ నుంచి రైతులకు కానుకగా ప్రారంభించనున్నారు. 24 కరెంటుతో పడే లోడ్ లు, ఎక్కువ లోడ్ లు వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మార్చికల్లా 11వేల మెగావాట్లకు పైగా డిమాండ్ వస్తుందని అంచనా వేశారు. దానికి తగినట్లు విద్యుత్ ను సమకూర్చడానికి ఏర్పాట్లు చేశామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రభాకర్ రావు చెప్పారు.  రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. విడతలవారీగా కాకుండా 24 గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్‌ భావించారు. 2016 జులై నుంచి మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ అందించారు. ఆ తర్వాత 2016 నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 23 లక్షల పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేశారు. దీంతో 2018లో 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.రూ.12,610 కోట్ల వ్యయంతో 24 గంటల విద్యుత్ అందించేందుకు కో, ట్రాన్స్ కో, ఎన్.పి.డి.సి.ఎల్., ఎస్.పి.డి.సి.ఎల్. సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. ట్వంటీ ఫోర్‌ హౌవర్స్‌ ఉచిత విద్యుత్ నేప‌ధ్యంలో రైతులు స్వచ్ఛందంగా ఆటో స్టార్ట‌ర్లు తొల‌గించాల‌ని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో అటు భూగ‌ర్భజ‌లాలు కాపాడుకోవ‌టంతో పాటు విద్యుత్ వృధాను అరిక‌ట్టడానికి రైతులు స‌హ‌క‌రించాల‌ని కోరారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14079
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author