శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ విద్యార్థులతో చెలగాటం

శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ విద్యార్థులతో చెలగాటం
December 30 13:43 2017
అనంతపురం,
 శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నిర్లక్ష్యంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఇటు ఏపీ, అటు తెలంగాణలో డిఏస్సీ, టెట్ రాత పరీక్షలు జరగనున్ననేపథ్యంలో పట్టా తీసుకోని విద్యార్థులు ఆందోళనకు గురౌతున్నారు. స్నాతకోత్సవం జరిగి.. నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ ఒరిజినల్ డిగ్రీ పట్టాలు అందలేదు. వర్శీటీ నిర్లక్ష్యంతో పట్టాలు అందక ఇబ్బంది పడుతున్నారుఅనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీలో విద్యార్హతలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు అందక… పోటీ పరీక్షలకు సిద్ధమౌతోన్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం లో 18వ స్నాతకోత్సవం ను డిసెంబరు 7వ తేదీన జరిపారు. అయినా నేటికి చాలా మంది అభ్యర్థులకు డిగ్రీ పట్టాలు అందలేదు. వాస్తవానికి డిగ్రీ పట్టాలను ఆయా కళాశాలలకు యూనివర్సిటీ యాజమాన్యం నేరుగా పంపించాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో అంతులేని జాప్యం చోటుచేసుకుంది. ఆంద్రప్రదేశ్తో పాటు తెలంగాణలో డిఏస్సీ, టెట్ పరీక్షలు త్వరలో జరగనున్నాయి. ఈ నెలాఖరు లోపు తెలంగాణ డీఎస్సీకి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దూరవిద్య పీజీ పూర్తి చేసిన తెలంగాణ ప్రాంత విద్యార్థులు, రెగ్యులర్ డిగ్రీ, పీజీ చేసిన ఎస్కేయూ పరిధిలోని అభ్యర్థులు తమ పట్టాలు అందేది ఎప్పుడో అని ఎదురుచూడాల్సిన  పరిస్థితి నెలకొంది. స్నాతకోత్సవ నోటిఫికేషన్ కింద దరఖాస్తు చేసుకుంటే నామమాత్రపు ఫీజు వుంటుందనే వెసులుబాటు కోసం చాలా మంది వేచి చూసారు. వారు ఆశించిన విధంగా ఒరిజినల్ డిగ్రీ పట్టాల 18వ స్నాతకోత్సవంకు సంబంధించి దరఖాస్తులకు ఈ ఏడాది ఏప్రిల్ లో నే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 25వేల777 దరఖాస్తులు అందాయి. ఇందులో 6వేల 32 మంది ఇన్ అడ్వాన్స్ కింద స్నాతకోత్సవం కంటే ముందే ఎక్కువ రుసుం చెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్నారు. మిగిలిన విద్యార్థులు డిసెంబర్ 7 వరకు వేచి చూశారు. 5వేల మంది విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ లను ఆయా కళాశాలలకు పంపారు. ఇంకా 14వేల745 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ ల కోసం వేచి చూస్తున్నారు.ఇప్పటికైన యూనివర్సిటీ పాలకులు మొద్దు నిద్ర వీడి అభ్యర్థులకు తొందరగా పట్టాలు ఇవ్వాలని పలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14102
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author