పచ్చదనం కరవు..పెరిగిన ఆక్వాకల్చర్

పచ్చదనం కరవు..పెరిగిన ఆక్వాకల్చర్
December 30 14:13 2017
ఏలూరు,
కోనసీమ అంటే పచ్చని పంటపొలాలు,విస్తారమైన కొబ్బరి తోటలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయం…. పచ్చదనానికి మారుపేరైన కోనసీమ, కొందరు స్వార్థపరుల అనాలోచిత నిర్ణయాలతో కాలుష్యపు కోరలలో చిక్కి తన స్వరూపాన్నే కోల్పోయే ప్రమాదంలో పడింది ….పచ్చదనానికి మారు పేరైన కోనసీమలో పచ్చదనం కరువయ్యే పరిస్థితి నెలకొంది.తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకు ఎంతో ప్రాముఖ్యత  ఉంది. పచ్చదనంతో కూడిన నిండైన వరిచేలు, విస్తారంగా ఉన్న కొబ్బరి తోటలు ఇక్కడి ప్రత్యేకత..అందమైన ప్రదేశాలు, స్వచ్చమైన గాలి, నీరు చక్కటి వాతావరణం ఉన్న కోనసీమ, నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఒకప్పుడు కోనసీమ ప్రాంతంలో వరి, కొబ్బరి పంటలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. వీటితో పాటు ఆయా కాలాలలో అపరాలు కూడా పండించే వారు. ఈ క్రమంలో కొందరు మూడు దశాబ్దాల క్రితం ఆక్వా సాగును మొదలు పెట్టారు. ఆక్వా సాగు లాభాల రావటంతో అందరి చూపు దీనిపై పడింది. దీంతో అధిక సంఖ్యలో దళారీలు ఆక్వాసాగును మెదలుపెట్టారు. రైతులకు అధిక మొత్తం లో కౌలు ఆశచూపి బంగారం లాంటి వరిచేలు, కొబ్బరి తోటలు ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు. వీటికి ఎటువంటి నియమనిబంధనలు లేవు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు పచ్చని పంటపొలాల మధ్య ఈ చెరువులను తవ్వి అడ్డగోలు గా ఆక్వాసాగు కొనసాగిస్తున్నారు.  దీంతో చుట్టు  ప్రక్కల ఉన్న వరిచేలు పాడవుతున్నాయి.  ఆక్వా చెరువులకు ఉపయోగించే ఉప్పునీటితో పంటలు పండడం లేదు. ఆక్వా సాగుకు ఉపయోగించే ఫీడ్స్, కొన్నిరసాయనాలు చాలా కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. ఈ ఆక్వా చెరువులతో భూగర్భ కాలుష్యం పెరిగి త్రాగు నీరు కలుషితమౌతోంది. వీటిని నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఈ ఆక్వా చెరువులో కొందరు కోళ్ల మాంసపు వ్యర్దాలు, కుళ్ళిన పలు వ్యర్ధపదార్థాలు ఉపయోగిస్తూ వాతావరణాన్నిమరింత కలుషితం చేస్తున్నారు.ఎక్కువగా రసాయనాలు ఉపయోగిస్తూ, నిబంధనలను ఉలంఘించి ఆక్వసాగు చేసేవారి పై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.  పచ్చదనానికి ప్రతీక అయిన కోనసీమలో పచ్చదనం పరవళ్లు ఇనుమడింపచేయాలను కోనసీమ వాసులు కోరుకుంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14114
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author