గుప్తనిధుల కోసం తవ్వకాలు

గుప్తనిధుల కోసం తవ్వకాలు
December 30 14:20 2017
ఒంగోలు,
పదహారు వేల మంది గోపికలతో అలరించిన వేణుగోపాలునికి ప్రస్తుతం నైవేద్యం కరవయ్యింది. ఆయన పేరిట ఉన్న పంట భూములు అక్రమార్కుల చేతిలో బందీలయ్యాయి. ఆయన ఆలయంలో నిధులున్నాయంటూ దొంగలు….రికార్డు స్థాయిలో కన్నాలు వేశారు. వెన్నముద్దలు తిన్న వేణుగోపాలునికి ఇంత అన్నం పెట్టి…ఉత్సవం చేయాలంటే చందాలు వేసుకునే దుస్థితి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కొలువైన వేణుగోపాలుని పరిస్థితి ఇది. ఇది
16వ శతాబ్ధం నాటి మిల్లంపల్లి వేణుగోపాలస్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్రకు చెదలు పట్టాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఆ ఆలయంలో ఇప్పుడు ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. ఆలయానికి పూర్వులు రాసిన భూములు అక్రమార్కుల చెరలో బందీలయ్యాయి. అంతేకాదు ఆలయంలో గుప్త నిధుల కోసం దొంగలు కన్నాలు వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చోద్యం చూసేవారే కానీ…పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.  కోట్ల రూపాయల ఆస్తులున్నా…ప్రతీ ఏటా ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మాత్రం స్థానికులు చందాలు వేసుకుని డబ్బు పోగేయాల్సిందే. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం చరిత్ర కలిగిన మిల్లంపల్లి వేణుగోపాలస్వామి ఆలయ చరిత్రకు  చెదులు పట్టింది.  పట్టణానికి కిలొమీటర్ దూరంలొ ఉన్న 16 శతాబ్దానికి చెందిన  శ్రీకృష్ణదేవరాయలు కాలంలొ నిర్మితమైన ఈ ఆలయం అబివృద్దికి నొచుకొక గుప్తనిధుల దొంగలుకు అవాసంగా మారింది.
మిల్లంపల్లి వేణుగోపాలస్వామి ఆలయానికి  అనాటి నుండే వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. భూములు కౌలుకు ఇవ్వగా వచ్చిన ఆదాయంతో ఆలయ అబివృద్దికి, ఉత్సవాలకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ప్రస్తుతం స్వామివారికి చెందిన ఆలయం భూములకు సైతం అక్రమార్కులు పట్టాలు పుట్టించుకుని… స్వామికి శఠగోపం పెట్టారు. నిత్య ధూప..దీప నైవేద్యాలకు అవసరమైన డబ్బు కోసం ఎదురు చూసే పరిస్థితి నిత్యకృత్యమైంది.  ఆస్తులున్నా…ఆదాయం రాకపోవటంతో ప్రతీ సంవత్సరం జరపాల్సిన ఉత్సవాలకు చందాలు వేసుకుని మమ అనిపిస్తున్నారు.  ఈ ఆలయంలో ఎక్కడా లేనివిధంగా అనేకసార్లు దొంగలు గుప్తనిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరపటం కూడా ఓ రికార్డే. ఇంత జరుగుతున్నా అధికారులు, ఆలయ కమిటీ మీనమేషాలు లెక్కించడంపై స్థానికుల నుంచి ప్రతిఘటనలు ఎదురౌవుతున్నాయి.  గుప్తనిధుల వేట, కోట్లాది రూపాయల ఆలయ భూముల ఆక్రమణతో ఆలయ అభివృద్ధి పూర్తిగా కనుమరుగైంది. గత చరిత్రకు నిదర్శనంగా ఉన్న వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ మొద్దు నిద్ర పోతుంటే…వారిని లేపాల్సిన ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ మరింత నిద్రలో ఉండిపోయింది. ఇప్పటికైనా భూముల స్వాధీనం, ఆలయంలో వాచ్ మెన్ నియామకం, నిత్య ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా చూడాలని…ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14118
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author