ఇది తెరాస వైఫల్యాల ఏడాది : టీటీడీపీ నేత రావుల

ఇది తెరాస వైఫల్యాల ఏడాది : టీటీడీపీ నేత రావుల
December 30 16:53 2017
హైదరాబాద్.
తెరాస ప్రభుత్వానికి  మూడున్నర సంవత్సరాలు ముగుస్తున్నా కేసీఆర్ పాలనలో అహంకారం, అక్రమాలు, అవినీతి తగ్గలేదని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. శనివారం నాడు అయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడారు. తెరాస  నేతలు 2017లో ఎన్నో కలెక్టర్ స్థాయి అధికారులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు.  ఎమ్మెల్యే స్థాయి నేతల పై ఆరోపణలు వస్తే సీఎం స్పందించలేదు.  ఏకంగా మంత్రి రంగంలోకి దిగి అక్రమాలకు దిగితే సీఎం పట్టించుకోరని అయన అన్నారు.  2017 సంవత్సరం అవినీతి  అక్రమాలు, అక్కసుతో టీఆరెస్ పాలన ముగిసింది.  అన్ని రకాల అక్రమాలను కలిపితే టీఆరెఎస్ 2017 పాలన ఆవుతుందని అయన అన్నారు. శాసనసభ వేదికగా మాట్లాడిన కేసీఆర్ కేంద్రం పథకాలు, నిధులు అమలు చేస్తాం అన్నారు. కానీ ఆచరణ మాత్రం ఎక్కడా లేదు. రూ  5600 కోట్లను కేంద్రం వివిధ పథకాలకు విడుదల చేస్తే అందులో 3 వేల కోట్లు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన 2వేల కోట్లు ఎటు వెళ్లాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని అయన డిమాండ్ చేసారు. కేంద్రం నుంచి తెలంగాణలో పాఠశాలకు ఒక్కో టాయిలెట్స్ కోసం 2లక్షల చొప్పున 4200 కు విడుదల చేసింది. కానీ కేసీఆర్ కేవలం రంగారెడ్డి లో ఒకే ఒక్క టాయిలెట్ నిర్మాణం చేసిందని అన్నారు.  కేటీఆర్ విదేశాలకు ఆహ్వానం వచ్చినట్లే గ్రామాలు కూడా టాయిలెట్ల నిర్మాణం కోసం ఆహ్వానం వచ్చినా…కేటీఆర్ ఎందుకు నిర్మించడం లేదో సమాధానం చెప్పాలని అయన అన్నారు.  ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నడపడానికి వచ్చిన అవకాశం కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మణిపూర్ వెళ్ళింది. కేసీఆర్ కి ఇష్టమైన ప్రోగ్రామ్స్ జరుగుతాయి కానీ…ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రోగ్రామ్ మాత్రం ఎందుకు జరగదు. కేసీఆర్ కి ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇష్టం లేదా అని నిలదీసారు.  ఉస్మానియా యూనివర్సిటీ కి మూడున్నర సంవత్సరాలలో ఒక్క మంత్రి పోవడం లేదు..!  దళితున్ని సీఎం చేస్తా అన్న కేసీఆర్..దళితుని కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణను జైల్ లో వేశారని విమర్శించారు.  ప్రపంచ వేదికగా మహిళా సదస్సు జరిగితే… మహిళలకు అవకాశం ఇవ్వకుండా ట్రంప్ కూతురు ముందు కేటీఆర్ ప్రసంగం చేస్తారా ని ప్రశ్నించారు. మంత్రులు  తుమ్మల, నాయిని, కడియం కంటే ఒక్క మహిళ కూడా బెటర్ గా కనిపించలేదా. ఎందుకు మహిళలను క్యాబినెట్ లో తీసుకోలేదో సమాధానం చెప్పాలని అన్నారు.  రాష్టంలో రైతుల రుణమాఫీ కాలేదు…గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూలి బిల్లులు రిలీజ్ కావడం లేదు. మొత్తానికి  2017 సంవత్సరం టీఆరెస్ ప్రభుత్వం సంపూర్ణంగా వైఫల్యాల పుట్టగా మారిందని రావుల వ్యాఖ్యానించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14162
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author