ఇంకా అంటరానితనం వుంది

ఇంకా అంటరానితనం వుంది
December 30 17:05 2017
భువనగిరి,
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు  కే.రాములు యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం  పర్యటించారు . పర్యటన లో భాగంగా భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో దళితవాడను సందర్శించి దళిత వాడలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాడాలో ఎస్సీ  కమ్యూనిటీ హాల్ ను వెంటనే నిర్మించాలని,  సీసీ రోడ్ లు వేయాలని, గ్రామంలో వృద్ధులకు పెన్షన్ లు రాకపోవడం కమిషన్ దృష్టికి తేగ వెంటనే ఆ సమస్య లను పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు . అనంతరం భువనగిరి ఆర్ అండ్ బీ  గెస్ట్ హౌస్ లో మీడియా తో మాట్లాడుతూ దేశానికీ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ దళితులు అంటరానివారిగా జీవించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో దళితులపై దాడులా విషయంలో పోలీసులు అగ్రకులాల పక్షం వహిస్తూ వాళ్ళ ముందే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం దారుణమన్నారు.  ఇది ఎ రాష్ట్రంలో లేదని అన్నారు. అసైన్డ్  భూముల అన్యాక్రాంతం విషయంలో, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈకార్యక్రమంలో  దళిత మోర్ఛా రాష్ట్ర నాయకులు వేముల అశోక్ , బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, ఆర్డీవో భూపాల్ రెడ్డి, దళిత న్యాయవాది జయ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14165
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author