వందశాతం ఆన్ లైన్ సేవలు : మేయర్ రామ్మోహన్

వందశాతం ఆన్ లైన్ సేవలు : మేయర్ రామ్మోహన్
December 30 17:28 2017
హైదరాబాద్,
ముఖ్యమంత్రి  కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. 2017వ సంవత్సరంలో జీహెచ్ఎంసీ సాధించిన పురోగతిపై ఇయర్ రౌండప్ నిర్వహించిన మేయర్ …అన్ని రంగాల్లో జీహెచ్ఎంసీ ముందుందన్నారు. ఈ ఏడాది రూ. 230 కోట్లతో నాలాల విస్తరణ చేపట్టామని మేయర్ రామ్మోహన్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తం ఆన్లైన్ సర్వీసులు ప్రారంభించామన్నారు. అలాగే 2.60లక్షల ఎల్ఈడీ దీపాలను అమర్చామని ఆయన అన్నారు. అలాగే లక్ష బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, దేశంలోని మెట్రో నగరాల్లో స్వచ్ఛ్ సర్వేక్షన్లో అగ్రస్థానంలో ఉన్నామని మేయర్ తెలిపారు. అంతేగాక ఏరియా సభలు, వార్డు కమిటీల నియామకం పూర్తి చేశామని, రూ.43 కోట్లతో 117 జంక్షన్ల అభివృద్ధి, 40 మోడల్ మార్కెట్లు పూర్తిచేశామని మేయర్ తెలిపారు.ఇప్పటికే హైదరాబాద్ లో లక్షా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. ఎస్ఆర్డీపీ పనులు వేగవంగా సాగుతున్నాయన్నారు. వచ్చే రెండేండ్లలో ట్రాఫిక్ కష్టాలు దూరం అవుతాయన్నారు. పేదల ఇండ్లలో శుభకార్యాల కోసం మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక టౌన్ ప్లానింగ్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి లభించిందన్నారు. జీహెచ్ఎంసీ 100శాతం ఆన్లైన్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో జీహెచ్ఎంసీ ముందుందన్నారు. ప్రజా సౌకర్యాల కల్పనలో జీహెచ్ఎంసీకి పలు అవార్డులు వచ్చాయన్నారు. జీహెచ్ఎంసీలో నిర్వహించిన ఇయర్ రౌండప్లో కమిషనర్ జనార్ధన రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14180
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author