అవి చెక్కభజన సభలు : మందకృష్ణ మాదిగ

అవి చెక్కభజన సభలు : మందకృష్ణ మాదిగ
December 30 17:49 2017
హైదరాబాద్,
 తెలుగు ప్రపంచ మహా సభలు కావవి కేసీఆర్ చెక్క భజన సభలు అవి అని ఘాటుగా విమర్శించారు మందకృష్ణ మాదిగ.  శనివారం నాడు సికింద్రాబాద్ పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ నిన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.  శ్రీహరి చేసిన వ్యాఖ్యలన్నిటికి సవివరంగా సమాధానం ఇచ్చిన మందకృష్ణ,  సభలు గల్లీలో కాదు ఢిల్లీలో చేయాలని శ్రీహరి ఇచ్చిన సూచనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.   అయితే తాను చేసే దీక్షలకు సభలకు తెరాస మద్దుతుగా ఇస్తుందా అని ప్రశ్నించారు.. లేదా తెరాస చొరవ తీసుకొని ఢిల్లీకి వెళితే తాను వారి వెంబడి రావడమే  కాకుండా ఎల్లప్పుడూ తెరాస కు మద్దతుగా నిలుస్తానని మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నట్లు ప్రకటించారు. సంస్మరణ సభలో టీడీపీ,బీజేపీ,కాంగ్రెస్ లను నమ్మే ప్రసక్తే లేదని చెప్పాను.  తెరాస రెండు అడుగులు ముందుకు వచ్చింది అని చెప్పాను. కానీ డిప్యూటీ సీఎం నేను ఈ మూడు పార్టీలతో అంటకాగుతున్నట్లు పేర్కొనడం అవగాహనా  రాహిత్యం అని అన్నారు.. నాకు జాతి ప్రయోజనాలే ముఖ్యం కానీ రాజకీయ ప్రయోజనాలు లేవు.. నీవు గతంలో టీడీపీ మంత్రివి, టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి తెరాస మంత్రిగా కొనసాగుతున్నావు ఎవరివి రాజకీయ ప్రయోజనాలు గుర్తెరిగి మాట్లాడాలని శ్రీహరిని కోరారు. తెలుగు ప్రపంచ మహాసభల ని  అంటున్నారు అవి ప్రపంచ మహా సభలుగా నేను గుర్తించను ఎందుకంటే తెలుగు భాషకు, తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది   నీకు,  ముఖ్యమంత్రి కేసీఆర్
కు రాజకీయ జీవితాన్నిచ్చిన ఎన్టీఆర్ ను కనీసం గుర్తు చేసుకొని సభలు, తెలంగాణ జాతీయ గీతాన్ని రాసిన అందెశ్రీని పిలవని సభలు ఎలా ప్రపంచ మహాసభలు  అవుతాయి అని ప్రశ్నించారు. ఇవి  తెలుగు మహాసభలు కాదు కేసీఆర్ భజన, కేసీఆర్ చెక్క భజన సభలు అని అన్నారు. ఇప్పటికైనా తెరాస కు చిత్తశుద్ధి ఉంటే శీతాకాల సమావేశాల్లోపే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు పోవాలని కోరారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14196
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author