కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదని ప్రూవ్ చేసిన చిన్న సినిమాలు

కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదని ప్రూవ్ చేసిన చిన్న సినిమాలు
December 30 18:58 2017
హైద్రాబాద్,
టాలీవుడ్ సినిమా అంటే స్టార్స్ ఉన్న పెద్ద సినిమానే అని అంతా అనుకుంటారు. కానీ 2017 ఆ ఒపీనియన్ ను తుడిచిపెట్టింది. బాగా తీస్తే చిన్న సినిమాను అయినా ఆడియన్స్ ఆదరిస్తారు అన్నది 2017లో రుజువైంది. ఈ ఏడాది పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలూ హిట్టయ్యాయి. హిట్ కావడమే కాదు.. కొన్ని చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పోటీపడి సూపర్ హిట్ గా నిలిచాయి. 2017 చిన్న సినిమాలకు ఊపిరి పోసిందని చెప్పాలి. కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది ఎక్కువ చిన్న సినిమాలు విజయం సాధించాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంక్రాంతికి వచ్చిన రెండు బిగ్ మూవీస్ ను ఢీకొని తన సత్తా చాటింది శతమానం భవతి. కథ బాగుంటే చాలు ఏ సినిమా అయినా నిలబడుతుందనేదానికి శతమానం భవతి చక్కటి ఉదాహరణ. శతమానం భవతితో మొదలైన చిన్న సినిమా విజయం ఆ తర్వాత కూడా కొనసాగి , స్మాల్ మూవీస్ కు ఈ ఏడాది నిజంగానే శతమానం భవతిగా మారింది. ఫిదా , అర్జున్ రెడ్డి చిన్న సినిమాలైనా తెలుగు తెరపై దుమ్ము రేపాయి. చిన్న సినిమా స్టామినాను చాటాయి. అలాగే పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్ పై తీసిన చిన్న సినిమాలూ విజయవంతమయ్యాయి. రారండోయ్ వేడుక చూద్దాం, హలో సినిమాలు ఇందుకు ఉదాహరణ. హల్ సినిమా అక్కినేని అఖిల్ కు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. పెద్ద హీరోలే కాదు, పెద్ద సినిమాలే కాదు, హీరో ఎవరైనా సరే… పిక్చర్ హిట్టవుతుందని ప్రూవ్ చేసిన సినిమాలు నేను లోకల్, నిన్నుకోరి, ఎంసిఏ, మహానుభావుడు, ఆనందో బ్రహ్మ. వీటిలో కొన్ని బలమైన కథతో ఆకట్టుకుంటే, మరికొన్ని సరదాగా రన్ అయి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేశాయిఇక భల్లాలదేవుడు రానా నటించిన నేనే రాజు- నేనే మంత్రి మూవీ కూడా హిట్టయింది. విశేషమేంటంటే ఈ సినిమాలో రానా తప్ప వేరే ఆకర్షణలేవీ లేవు. మొత్తానికి చిన్న సినిమాలూ తీయవచ్చు. అవి కూడా హిట్ అవుతాయి అని ధైర్యాన్నిచ్చింది 2017. వచ్చే ఏడాది కూడా ఈ విజయపరంపర కొనసాగాలని ఆశిద్దాం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14220
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author