పద్మావతి టైటిల్ మార్పు

పద్మావతి టైటిల్ మార్పు
December 30 18:59 2017
ముంబై,
తీవ్ర వివాదాల్లో చిక్కుకుని, వివిధ రాష్ట్రాల్లో నిషేధానికి కూడా గురి అయ్యి.. విడుదల జాప్యంలో ఉన్న ‘పద్మావతి’ సినిమా టైటిల్ మారనుందా? ఈ సినిమా పట్ల రాజ్ పుత్ సంఘాల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సెన్సార్ బోర్డు ఈ సూచన చేసిందా? దీంతో పద్మావతి కాస్తా ‘పద్మావత్’గా రానుందా? ఈ మేరకు ఊహాగానాలు చెలరేగాయిప్పుడు.సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకునే టైటిల్ లో రోల్ లో.. రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదట్లో తన భారీ తనంతో అందరినీ ఆకట్టుకుంది. సినిమా షూటింగ్ జరుగుతన్నంత సేపూ వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత మరో రకంగా వార్తల్లోకి ఎక్కింది. ఈ సినిమాలో రాజపుత్ర వనిత రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించారని.. రాజ్ పుత్ లు అభ్యంతరాలు మొదలుపెట్టారు. అతి స్వల్ప సమయంలోనే వారి ఆందోళనలు పతాక శీర్షికకు చేరాయి.దీపికాపదుకునే ముక్కు, చెవులు కోయాలని కొంతమంది పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాపై విడుదలకు ముందే నిషేధాన్ని వేశాయి. అయితే కోర్టుల నుంచి మాత్రం నిషేధాలకు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇంత రచ్చ మధ్యన పద్మావతి సెన్సార్ కు వెళ్లింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు పలు సూచనలు చేసిందని.. టైటిల్ ను పద్మావత్ గా మార్చడంతో పాటు.. ఈ సినిమాను ఎలాంటి చరిత్ర ఆధారంగా నిర్మించలేదనే విషయాన్ని సినిమా ఆరంభంలో.. ఇంటర్వెల్ లో తప్పనిసరిగా వేయాలని సెన్సార్ బోర్డు స్పష్టం చేసినట్టు సమాచారం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14223
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author