పది శాతం మంది కంటి లోపమే

పది శాతం మంది కంటి లోపమే
December 30 19:11 2017
రంగారెడ్డి,
జాతీయ, రాష్ట్ర అంధత్వ నియంత్రణ సొసైటీలు సంయుక్తంగా ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం  జిల్లా అంధత్వ నియంత్రణ సొసైటీ (డీబీసీఎస్‌)ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి కళ్లజోళ్లు అందజేస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్సలు సైతం నిర్వహిస్తారు. ఈ విద్యా సంతవ్సరంలో ప్రభుత్వ జెడ్పీ, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్, ఆశ్రమ, మైనారిటీ స్కూళ్లలో విద్యార్థులను స్క్రీనింగ్‌ చేశారు. జులై నుంచి డిసెంబర్‌ వరకు మొత్తం 240 పాఠశాలల్లో 68,777 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 5,995 మంది విద్యార్థులు కంటిచూపు లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరందరికీ ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మరో 44 మందిలో దృష్టిలోపం అధికంగా ఉండడంతో ఆస్పత్రులకు రిఫర్‌ చేశారు.  చిన్నవయసులోనే దృష్టిలోపం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని కంటి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అత్యధికంగా జన్యుపరంగా దృష్టిలోపం సంక్రమిస్తుండగా.. మరికొందరిలో తగిన పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల కంటిచూపు మందగిస్తోందని వెల్లడిస్తున్నారు. ఇటీవలి కాలంలో టచ్‌ స్క్రీన్లు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. మొబైల్స్‌ (సెల్‌ఫోన్లు)తో విద్యార్థులు అధిక సమయం గడుపుతున్నారు. సర దా, కాలక్షేపం కోసం వాటిని వినియోగిస్తుండడం వల్ల కళ్లు ఒత్తిడికి గురై చూపు తీవ్రత తగ్గుతోంది. టీవీలు, ట్యాబ్‌ల వల్ల ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చీకటి గదుల్లో చదవడమూ కొంత కారణమవుతోంది.  కంప్యూటర్, టీవీలకు దూరంగా ఉంచాలి. అవసరమనుకుంటే తప్ప వాటిని వినియోగించకూడదు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కంటి భద్రత కోసం హెల్మెట్, కూలింగ్‌ గ్లాసులు ధరిస్తే మేలు. సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కళ్లు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఈ విషయం లో పిల్లలకు అవగాహన కల్పిం చాలి. బయటి
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14232
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author