నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు
December 30 20:44 2017
సికింద్రాబాద్,
సికింద్రాబాద్ లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 8 మంది ని నార్త్ జోన్ టాస్క్ ఫోర్ప్ పోలీస్ లు అరెస్టు చేసారు. వారివద్దనుండి 2 లాప్ టాప్, ఒక ప్రింటర్, పాస్ పోర్ట్ లు, మొబైల్స్, వివిధ విద్యా సంస్థలకు సంబంధించిన సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా చివరకు జనన, మరణ సర్టిఫికెట్స్ కూడ చేయిస్తామని అమాయక ప్రజలను మోసం చేసారని పోలీసులు అంటున్నారు.
ముఠా కార్యకలాపాలపై  విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగి నకిలీ పాప్ పోర్టులు,  నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసారు. అబ్దుల్ అనే వ్యక్తి నకిలీ పాస్ పోర్టు తో అమెరికాకు పోవడానికి ప్రయత్నించి, పోలీసులకు దొరికిపోయాడు. దాంతో ముఠా గుట్టు రట్టయింది. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్మడమే కాకుండా ఘరానా మోసానికి ఈ ముఠా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తమ విచారణతో తేలిందని టాస్క్ పోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు తెలిపారు.   వీరు నకిలివి తయారు చేయడమే కాకుండా వాటి ఆధారంగా ఒరిజినల్ ఓటరు ఐడి కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు పొందడంలో ఘటికులు.  ఇంతటితో ఆగకుండా వీరు కేజీ టూ పీజీ సర్టిఫికెట్లు కూడా తయారు చేసి అమ్మతున్నారని తేలింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14241
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author