అక్షరం నాశనం లేనిది : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అక్షరం నాశనం లేనిది : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
January 01 16:40 2018
విజయవాడ,
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 29వ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రిబ్బన్ కట్ చేసి పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభమైన పుస్తక మహోత్సవం 11 రోజుల పాటు జరగనుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సరస్వతీ దేవి విద్యకు అధి దేవత అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సంగీతం, సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నాశనం లేనిది అక్షరం అని… అదే అక్షరంతో భాష ప్రారంభమవుతుందన్నారు. అక్షరాన్ని దైవ సమానంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. పుస్తకాల్లో, శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం ఇమిడి ఉందన్నారు. నిత్య జీవితంలో పుస్తకానికి, అక్షరానికి ఎంతో ప్రాధాన్యత ఉందని అయన అన్నారు. అక్షరానికి మనం దైవ స్థానం ఇచ్చామన్నారు. పుస్తక మహోత్సవాన్ని భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అక్షరం నాశనం లేనిదని, అక్షరంతోనే భాష ప్రారంభమవుతుందన్నారు. పెద్దలు చెప్పిన ప్రతి విషయాన్ని విశ్లేషించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ భాషను కాపాడుకోవడంలో పుస్తకాలది ప్రముఖ పాత్ర అని అన్నారు. భాష లేకపోతే సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగవుతాయన్నారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, బాషను కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు. భావితరాలకు చరిత్రను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. 2018ని తెలుగు భాషా పరిరక్షణ సంవత్సరంగా ప్రకటిస్తున్నామన్నారు. 2017 రాష్ట్రానికి బాగా కలిసొచ్చిందని, అనేక సమస్యలను అధిగమించామన్నారు.  పుస్తకాలతోనే చరిత్ర తెలుస్తుందని, పుస్తకాలు లేకపోతే చరిత్ర అనేదే లేదని ముఖ్యమంత్రి అన్నారు. సాహిత్యానికి విజయవాడ కేంద్రంగా ఉందని, ఎందరో గొప్పవారు ఇక్కడి వాళ్లేనన్నారు. విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని.. పూర్వవైభవం తెచ్చేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. 2018ను తెలుగు భాషా పరిరక్షణగా నామకరణం చేసుకోవాలన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14320
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author