దుర్గగుడిలో అపరచిత వ్యక్తి కలకలం

దుర్గగుడిలో అపరచిత వ్యక్తి కలకలం
January 02 10:09 2018
విజయవాడ,
డిసెంబరు 26 అర్థరాత్రి విజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈవో కోసం పూజలు నిర్వహించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. గుడి తలుపులు మూసేసిన తర్వాత పూజలు నిర్వహించడంపై విమర్శలు రావడంతో దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న పోలీసులు కీలకాంశాలను వెలుగులోకి తెచ్చారు. అప్పటి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, ఆలయ వైదిక కమిటీలో లేని ఓ వ్యక్తి దుర్గమ్మ సన్నిధిలో ఉన్నట్టు గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఉన్నారనే విషయాన్ని తేల్చడానికి దర్యాప్తు నిర్వహిస్తోన్న అధికారులు, ఆయన ఫోటోను విడుదల చేశారు. ఆలయంలో ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా ఆగమన శాస్త్ర నిబంధనలను అనుసరించాలి. దీనికి అనుమతులు కూడా తప్పనిసరి. ఆలయంలోని వైదిక కమిటీ తీరుపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.ఈఓ సూర్యకుమారికి వైదిక కమిటీలోని ఓ వర్గం దోసోహమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సత్వహాగా ఈవోకు దైవచింతన అధికం. పూజలు, హోమాల్లోనూ ఆమె నిష్టంగా పాల్గొంటారు. అయితే ఇటీవల కాలంలో ఆమెకు అన్నీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆలయంలో అక్రమాలపై విజిలెన్స్ కమిటీ విచారణ, పాలకమండలితో విభేదాలతో ఈవో సతమతవుతున్నారు. వీటన్నింటి నుంచి విముక్తి పొందాలంటే ప్రత్యేక పూజలు నిర్వహించాలని సలహా ఇచ్చారని, దీంతో ఆమె కోసమే ఈ పూజలు చేశారని కొందరంటున్నారు.సాధారణంగా దుర్గమ్మ ఆలయం రాత్రి 9 గంటలకే మూసేస్తారు. ఆ తరువాత ఉదయం వరకూ అంతరాలయాన్ని తెరవరు. కానీ, 26 న రాత్రి 11 గంటల తరువాత తాంత్రికులను రప్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఆయనతోపాటు ఓ సీనియర్ అర్చకుడు, మరో జూనియర్ అర్చకుడు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది.ఆరోజు అర్థరాత్రి ఒంటి గంట వరకూ ఆలయం తెరిచే ఉంచారన్నది సమాచారం. ఆలయాన్ని శుభ్రం చేసేందుకు ఇద్దరికి అనుమతి ఇచ్చామని అధికారులు అంటుంటే, వారి అనుమతితోనే ఎవరో పెద్దమనిషికి ప్రత్యేక పూజలకు అనుమతిచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ట్రస్ట్ బోర్డు సమావేశంలో తీవ్రమైన చర్చ జరుగగా, నిజాన్ని నిగ్గు తేలుస్తామని అధికారులు వ్యాఖ్యానించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14344
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author